'జగన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్, అలా అయితే పులివెందులలోను టీడీపీయే'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలయిందని తెలుగుదేశం పార్టీ నేత కూన రవి కుమార్ సోమవారం నాడు అన్నారు.

కడప, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీనిపై కూన రవి కుమార్ స్పందించారు.

కడప షాక్‌కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు

జగన్ సొంత జిల్లా కడపలో ఎమ్మెల్సీ స్థానాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవడంతోనే ఆయనకు కౌంట్ డౌన్ మొదలైందని అర్థమవుతోందని చెప్పారు. జగన్ కుటుంబం అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటుందని, అరాచకాలు జరగకపోతే పులివెందులలో కూడా ఇవే ఫలితాలు వస్తాయన్నారు.

Count Down to YS Jagan: TDP leader

రాబోయే రోజుల్లో అరాచకాలు పనికి రావన్నారు. కడపకు నీళ్లిచ్చినా జగన్ కుళ్లుకుంటారని, 2019 ఎన్నికల్లో జగన్‌కు రాజకీయంగా పుట్టుగతులు ఉండవని చెప్పారు. కడపలో విజయం టిడిపి అభ్యర్తి బీటెక్ రవిది కాదని, అది ప్రజాస్వామ్య విజయమన్నారు.

అందుకే వైసిపిలో చేరలేదు: జేసీ

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పొగరు ఎక్కువ అని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సీమ రైతులకు సాగునీరు ఇస్తే 2019లోను చంద్రబాబే సీఎం అని చెప్పారు.

రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న నాయకుడు చంద్రబాబేనని, సీమకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. జగన్‌కు పొగరు ఎక్కువ అని, మనిషికి ఎంత పొగరు ఉండాలో అంతే ఉండాలన్నారు.

అతి ఉంటే ప్రమాదమన్నారు అందుకే ఎన్నికలకు ముందు తాను టిడిపిలో చేరానని చెప్పారు. ఎంపీగా గెలవడం కోసం టిడిపిలో చేరలేదన్నారు. హంద్రీనీవా ద్వారా 201-19 నాటికి అనంతపురంలోని అన్ని గ్రామాలకు నీరు తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Kuna Ravi Kumar on Monday said that count down starts for YSR Congress Party chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...