ముందస్తు బెయిల్ కొట్టివేత: 'మల్లాది విష్ణును అరెస్ట్ చేయం', చింటూ రిమాండ్ పొడిగింపు
విజయవాడ/చిత్తూరు: కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టి వేసింది. ఎల్లుండి లోపు (బుధవారం) విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని విష్ణును న్యాయస్థానం ఆదేశించింది.
మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పైన కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తరఫు లాయర్ మాట్లాడుతూ.. తాము విష్ణును అరెస్టు చేయమని, విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ దర్యాఫ్తు అధికారికి సహకరించాలని సూచించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

మేయర్ అనురాధ హత్య కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో నిందితుల రిమాండును న్యాయస్థానం పొడిగించింది. ప్రధాన నిందితుడు చింటూతో పాటు మిగతా నిందితులకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.
చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను హత్య చేసిన కేసులో వారి మేనల్లుడు చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications