అమరావతిలో అంబటి రాయుడు - రైతుల డిమాండ్, తప్పించుకోలేక..!!

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతిలో పర్యటించారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్థానిక జేఏసీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం అమరావతి కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తున్న అంబటి రాయుడు..కొద్ది రోజులుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా అమరావతికి వెళ్లిన అంబటి రాయుడు పర్యటనలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అమరావతిలో అంబటి
స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు అమరావతికి వచ్చారు. వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అంబటి రాయుడును కోరారు. అంబటి రాయుడు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని తెలిపారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. జై అమరావతి అనాలని అడిగారు.

Ambati Rayudu

అనుకూల నినాదాల డిమాండ్
దీంతో వారు అడిగిన విధంగా అనుకూల నినాదాలు చేయటానికి అంబటి రాయుడు అంగీకరించలేకపోయారు. అదే సమయంలో వారిని కాదని ముందుకు రాలేదు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. వారంతా ముక్త కంఠంతో అమరావతికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేసారు. దీంతో అమరావతి ఎక్కడికి వెళ్ళదని సమాధానాన్ని అంబటి రాయుడు దాటవేశారు. రైతుల దీక్షా శిబిరానికి రావాల్సిందిగా రాజధాని రైతులు కోరగా.. ఈసారి వచ్చినప్పడు తప్పని సరిగా వస్తానని చెప్పారు. దీంతో రైతులు సైతం అంగీకరించారు. అంబటి రాయుడు అమరావతి పర్యటనలో చోటు చేసుకున్న ఆసక్తి కర పరిణామాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Ambati Rayudu

పోటీ ఎక్కడ నుంచి
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారని కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తానని గతంతోనే అంబటి రాయుడు ప్రకటించారు. ముందుగా ప్రజా సేవలో నిలుస్తానని స్పష్టం చేసారు. అందులో భాగంగా పలువురిని కలుస్తున్నారు. తాను వైసీపీలో చేరుతాననేది ప్రచారమేనని..ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాయుడు స్పష్టం చేసారు. వైసీపీ నేతలు మాత్రం రాయుడు తమ పార్టీ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నుంచే పోటీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో అమరావతితో అంబటి రాయుడు పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+