దొంగల బీభత్సం: గాయపడిన పోలీసులు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో గల సాయి కాలనీలో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. సాయుధ దోపిడీ దొంగల ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామన జరిగింది.
పది మందితో కూడిన సాయుధ ముఠా ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఇంటి ద్వారం వద్ద పెట్టిన పాయింట్ బుక్‌లో సంతకం చేయడానికి పోలీసులు అక్కడికి వచ్చారు. నిరాయుధులైన నలుగురు పోలీసులు దోపిడీ దొంగల్లో ఒకతన్ని పట్టుకున్నారు. ఇతర దొంగలు రాళ్లతో పోలీసులపై దాడి చేసి అతన్ని విడిపించుకుని చీకట్లో కలిసిపోయారు.
ఆయుధాలు లేకపోవడంతో గస్తీ పోలీసులు వారిని పట్టుకోలేకపోయారని పోలీసులు చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో బ్రిగేడ్ జిబి రెడ్డి, ఆయన భార్య రక్షా రెడ్డి గాఢ నిద్రలో ఉన్నారు. పోలీసులను 75 ఏళ్ల జిబి రెడ్డి ప్రశంసించారు. అదృష్టం బాగుండి తాము బతికిపోయామని ఆయన అన్నారు. ఆయన రచయిత కూడా.

తెల్లవారు జామున
దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకున్న సంఘటన తెల్లవారుజామను 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఎఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఓ హోం గార్డు మామూలుగానే కాలనీలో గస్తీకి వచ్చారు.

గాయపడిన పోలీసులు
తాము బుక్‌పై సంతకం చేయడానికి వచ్చినప్పుడు కారు వెనక ఓ వ్యక్తి దాక్కున్నట్లు గుర్తించానని, ఎవరూ అంటూ గట్టిగా కేక వేశానని, ఇంతలో ఇంట్లో మనుషుల కదలికలు కనిపించాయని కానిస్టేబుల్ బి. రంగస్వామి చెప్పారు. దొంగల దాడిలో అతను గాయపడ్డాడు.

చీకట్లో కలిసిపోయారు
దొంగను పట్టుకుని ఇంటి యజమానిని అప్రమత్తం చేయాలని అనుకున్నామని, అకస్మాత్తుగా నలుగురుూ వ్యక్తులు కిటికీ నుంచి దూకారని, మరో నలుగురు చీకట్లోంచి వచ్చారని అతను చెప్పాడు. ముఠా వద్ద కత్తులు, ఇనుప రాడ్స్ వంటి ఆయుధాలున్నాయని పోలీసులు చెప్పారు.

విడిపించుకుని పారిపోయారు
తాము ఒకతన్ని పట్టుకున్నప్పటికీ రెండు వైపుల నుంచి తమపై దొంగలు రాళ్లతో దాడి చేశారని, ఇద్దరం గాయపడ్డామని, అందరూ గోడ దూకి పారిపోయారని పోలీసులు చెప్పారు. తాము వెంటపడ్డామని, అయితే రాళ్లు విసురుతూ వాళ్లు పారిపోయారని చెప్పారు.

రాళ్లు విసిరారు..
పోలీసులపైకి రాళ్లు విసిరి వారి చేతిలో తమ సహచరుడిని విడిపించుకుని దోపిడీ దొంగలు పరారయ్యారు. పోలీసులు వెంట పడినా ఫలితం దక్కలేదు.

పారిపోయారు..
దొంగలు మెట్ల మీదుగా మొదటి అంతస్థుకు వచ్చారని, తలుపులూ ఆల్మారాలు తెరిచారని, అయితే వారికి ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పారు.

చీకట్లో కలిసిపోయారు..
దోపిడీ దొంగలు పోలీసులను చూసి కిటీకీలోంచి బయటకు దూకారు. వారు రాళ్లతో దాడి చేశారు. చీకట్లో ఉన్న మరో నలుగురు కూడా పోలీసులపైకి రాళ్లు విసిరారు.

గన్ ఉంది, కానీ..
తన వద్ద లైసెన్స్డ్ గన్ ఉందని, అది బెడ్ పక్కనే ఉందని, దాన్ని వాడే సమయం లభించలేదని రెడ్డి చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!