• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాను విన్న జగన్ వేరు.. చూసిన జగన్ వేరు.. తిట్టిన జగన్ వేరు..! పదవిచ్చే జగన్ కూడా వేరంటున్న దాడి

|

అమరావతి/హైదరాబాద్ : ఆయన విన్న జగన్ వేరు.. చూసిన జగన్ వేరు. ఇది దాడి వీరభద్ర రావు జగన్ కలిసిన తర్వాత తొలిసారి పలికిన పలుకులు. తర్వాత జగన్ పార్టీలో చేరిపోయిన వీరభద్రరావు కొన్నాళ్లకు వైసీపికి దూరంగా ఉన్నారు. దాదాపుగా చరమాంకంలో ఉన్నారు. కానీ ఆశలు మాత్రం కొత్త ఊసులు చెబుతున్నాయి. ఇంకా ఏవేవో కోరుకుంటున్నాయి. ఆయనే రెండు దశాబ్దాల పాటు వరసగా ఎమ్మెల్యేగా నెగ్గి, పలుమార్లు మంత్రిగా పనిచేసిన విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన దిగ్గజ నేత.

దాడి వీరభద్రరావు 1985 నుంచి 2012 వరకూ అంటే 27 ఏళ్ల పాటు టీడీపీతోనే రాజకీయం నెరిపారు, మెరిసారు. ఆయన పదవులన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినవే. మంత్రిగా, శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా దాడి తమ మార్క్ చూపించారు. రెండవమారు కూడా తనకు ఎమ్మెల్సీ కొనసాగింపు జరగకపోవడంతో బాబు వైఖరికి విరక్తి చెంది ఒక్కసారిగా సైకిల్ దిగిపోయారు. అదే దూకుడుతో అప్పట్లో జైల్లో ఉన్న జగన్ని కలసి మరీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

Dadi Veerabhadra Rao again joined in ysrcp..!!

ఇక తనకు ఇంకా రాజకీయం చేయాలని ఉన్నా పదవుల ఆశ ఉన్నా కూడా యువకుడైన జగన్ నాయకత్వంలో పనిచేయడం ఎందుకో నామోషీ అని భావించారో ఏమో ఆప్పట్లో కొడుకునే ముందు పెట్టి దాడి వీరభద్రరావు తాను వెనక ఉన్నారు.

2014లో కోరుకున్న అనకాపల్లి సీటు దక్కలేదు. విశాఖ పశ్చిమం ఇచ్చారు. ఆ అసంతృప్తిలోనే కొడుకుతో పోటీ చేయిందిన దాడి చివరికి ఓడిపోయారు. మరుసటి రోజే జగన్ని నానా మాటలు తిడుతూ వైసీపీకి రాజీనామా చేసారు. జగన్ నియంతని, రాజకీయ లక్షణాలు, నాయకత్వ ప్రతిభ లేనే లేవని దుమ్మెత్తిపోశారు. చిత్రంగా అదే గూటికి మళ్ళీ దాడి వీరభద్రరావు చేరుకోవడం సంచలనంగా మారింది.

తాజా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దాడికి మళ్ళీ మొండి చేయి చూపించారు జగన్. కానీ అభయహస్తం కూడా ఇచ్చారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు బంపర్ మెజారిటీతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో దాడి ఆనందానికి అవధులు లేవు.

మాట తప్పని జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని ఆయన ఆశిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇచ్చి రాజకీయాల్లో కీలకంగా చేస్తారన్న నమ్మకం కూడా దాడికి ఉన్నట్లుగా ఉంది. కాగా విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న దాడికి జగన్ తగిన హోదాను గౌరవాన్ని ఇస్తారని అంతా అనుకుంటున్నారు. మరి అదృష్టం దాడి వీరభద్ర రావు జీవిత చరమాంకంలో తలుపు తడుతుందేమో చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
From 1985 to 2012 ie 27 years of tidipi politics with politics and shiny. His posts are from there too. As a minister, the leader of the TDP party in the legislature showed their mark. The second time, he did not pursue MLC, and once again became bored with Babu's attitude and got down. With the same aggression, then, he joined in ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more