"దొంగ – పోలీస్" ఆట పేరుతో అత్తను కడతేర్చిన కోడలు.. దొరక్కుండా హైడ్రామా !
అదిరిపోయే ట్విస్టులు.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే పక్కా ప్లాన్ తో జరిగిన మర్డర్ వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. "దొంగ - పోలీస్" ఆట పేరుతో అత్తను కడతేర్చిన కోడలిని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం నుంచి బయటపడేందుకు హత్యను అగ్నిప్రమాదం లాగా సైతం మార్చి హైడ్రామా ఆడడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
స్థానిక అప్పన్నపాలెంలో సుబ్రహ్మణ్య శర్మ, లలిత దంపతులు తమ పిల్లలతో పాటు నివసిస్తున్నారు. వారితో పాటు సుబ్రహ్మణ్య శర్మ తల్లి జయంతి కనకమహాలక్ష్మితో కూడా ఉంటున్నారు. ఇటీవల జయంతి కనకమహాలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపగా.. ఆమె సొంత కోడలే చంపినట్లు దర్యాప్తులో తేలింది.

కుటుంబంలో తరచూ చిన్నచిన్న తగాదాలు జరిగేవని.. ఆ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ వేసి "దొంగ - పోలీస్" ఆట ఆడదాం అని లలిత అత్తను ఒప్పించింది. ఆట పేరుతో కనకమహాలక్ష్మిని కుర్చీలో కాళ్లకు తాళ్లు కట్టి, కళ్లకు గంతలు కట్టి కదలలేని పరిస్థితిలో బంధించింది. ఆ తర్వాత, లలిత వంట గదిలోంచి పెట్రోల్ తెచ్చి కనకమహాలక్ష్మిపై పోసి, దేవుడి గదిలో వెలిగించిన దీపం తీసుకుని ఆమెపైకి విసిరింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి వృద్ధురాలు అక్కడికక్కడే కాలిపోయింది.
అయితే కొద్దిసేపటి తర్వాత లలిత సహాయం కోసం కేకలు వేస్తూ ఇంటి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మొదట్లో పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా నమోదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో సాక్ష్యాలు సరిగ్గా సరిపోకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదికల్లో కూడా పెట్రోల్ వాడిన ఆనవాళ్లు తేలడంతో కేసును హత్యగా భావించి విచారించగా లలిత నేరాన్ని ఒప్పుకుంది.
అత్త తనపై ఎప్పుడూ అనవసరంగా చిరాకు పడుతుందని.. మాటమాటకు అవమానిస్తుందని కోడలు ఆరోపించింది. అందుకే భరించలేక ఈ పని చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ అనూహ్యఅ ఘటన పట్ల పెందుర్తి వాసులు సైతం షాక్ అవుతున్నారు. పోలీసులు లలితను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. చిన్న విషయాలపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం కాకుండా.. సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications