వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ ముఖ్యమంత్రిని కలవాలన్నా 'ఆమె'కు నిముషాల పని!?

|
Google Oneindia TeluguNews

ఆమె ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త. రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి. ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని కలవాలన్నా ఆమె ఇట్టే కలవగలదు. సామాన్యులకే కాకుండా కాస్తంత పరిచాయాలున్నవారికి కూడా ఆమె పేరు తెలియదు. కేవలం వీవీఐపీలు, అత్యున్నతస్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఆమె గురించి, ఆమె శక్తి సామర్థ్యాల గురించి తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే కనికా టెక్రివాల్ రెడ్డి.

సంచలనంగా కనికా పేరు

సంచలనంగా కనికా పేరు


ఢిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా కనికా పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ పట్టణంలోని ఒక మార్వాడీ కుటుంబంలో ఆమె జన్మించారు. విద్యాభ్యాసం ఊటీలో సాగింది. భోపాల్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తిచేసిన కనిక ముంబయిలో విజువల్ కమ్యూనికేషన్ అండ్ డిజైనింగ్ లో డిప్లమో చేశారు. లండన్ లో ఎంబీఏ చేశారు. పైలెట్ అవ్వాలనేది ఆమె కల. కానీ ఆ కలను పక్కనపెట్టి దేశంలో ప్రయివేటు విమానాలకు ఉన్న డిమాండ్ ను బట్టి కొత్తగా 'జెట్ సెట్ గో' పేరుతో వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.

క్యాన్సర్ ను జయించిన కనిక

క్యాన్సర్ ను జయించిన కనిక


'జెట్ సెట్ గో' పేరుతో ఒక సంస్థను స్థాపించి ఎంతో కష్టపడ్డారు.. తీవ్రంగా శ్రమించారు. ఈ కంపెనీ పెట్టాలనేది ఆమె కల. ఎవరైనా ప్రైవేటు జెట్ చార్టర్ కోరుకుంటే దాన్ని అరేంజ్ చేయటం'జెట్ సెట్ గో' బాధ్యత. 22 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వస్తే దాన్ని జయించిన ధీరవనిత ఆమె. ఈ సంస్థ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డుమీద ఉబెర్, ఓలా ఎలాగో ఆకాశంలో పయనించేవారికి 'జెట్ సెట్ గో' అలాంటిది.

రూ.5600 పెట్టుబడితో 500 మిలియన్ల టర్నోవర్

రూ.5600 పెట్టుబడితో 500 మిలియన్ల టర్నోవర్


అత్యున్నతస్థాయిలో ఉన్నవారు ప్రయాణాల కోసం ప్రయివేటు విమానాలను అద్దెకు తీసుకుంటుంటారు. ఇది ఆమెను బాగా ఆకర్షించింది. అటువంటివారికి మొదటగా గుర్తుకొచ్చే పేరు కనికా టెక్రివాల్ రెడ్డి. కేవలం రూ.5600 పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ 10 సంవత్సరాల్లో 500 మిలియన్ల టర్నోవర్ కు చేరుకుంది. ఐదు సంవత్సరాల క్రితం ఫోర్బ్స్ అండర్ థర్టీ విభాగంలో ఆసియా ఖండంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా నిలిచారు

సొంత ఎయిర్ క్రాప్టులు 8

సొంత ఎయిర్ క్రాప్టులు 8


లండన్ లో ఎంబీఏ పూర్తయిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు. తన తల్లిదండ్రులతో వ్యాపారం గురించి చర్చించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడినప్పటికీ దాన్ని ధీరోధాత్తంగా ఎదుర్కొన్నారు. తర్వాత 2014లో ఢిల్లీ వెళ్లి జెట్ సెట్ గో సంస్థ ను ప్రారంబించారు. తమ మాట కాదని సొంతంగా వ్యాపారం చేస్తుందన్న కోపంతో కొన్నాళ్లు తల్లిదండ్రులు మాట్లాడలేదుకానీ తర్వాత కుమార్తెమీద ప్రేమతో అంగీకరించారు. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన జెట్ సెట్ గో 2020 నాటికి 8 సొంత ఎయిర్ క్రాప్టులు, 200 మంది ఉద్యోగులు ఉన్నారు. 2020-21 నాటికి 6వేల ఫ్లైట్లతో లక్ష మంది ప్రయాణించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 6 సీట్లు ఉన్న ఛార్టెర్డ్ ఫ్లైట్ నుంచి 18 సీట్లు ఉన్న ఫ్లైట్ వరకు అందిస్తారు.

 విజయసాయిరెడ్డి అల్లుడి అన్న సతీమణి

విజయసాయిరెడ్డి అల్లుడి అన్న సతీమణి


ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి కనిక. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి శరత్ స్వయానా అన్న. ఆమెకున్న ఛార్టెర్డ్ ఫ్లైట్ ద్వారానే నగదు తరలింపు జరిగిందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఏయే సమయంలో ఎన్నిసార్లు ప్రయాణించింది? ఎక్కడెక్కడికి ఇవి ప్రయాణం చేశాయి? తదితర వివరాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈడీ సేకరించింది.

English summary
She is an aspiring entrepreneur.Level of Chief Ministers of States.She can meet the chief minister of any state here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X