Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..!
ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి నాలుగు వారాల పాటు సాగించిన యుద్దాన్ని ముగించేందుకు వీలుగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనతో అంతర్జాతీయంగా పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వార్ కు ఐదు రోజుల విరామం ప్రకటిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అలాగే నిన్న మొన్నటి వరకూ ఆకాశాన్నంటిన చమురు, గ్యాస్ ధరలు క్షీణించాయి.
మధ్యప్రాచ్యంలో శత్రుత్వాలకు పూర్తి, సంపూర్ణ పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్‌లు చాలా మంచి మరియు ఫలవంతమైన సంభాషణలు జరిపాయంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్లు తమ మునుపటి కదలికలకు వ్యతిరేక దిశలో కదిలాయి.ఇదే క్రమంలో బ్రెంట్ క్రూడ్ 13% పడిపోయి బ్యారెల్‌కు సుమారు $96కు చేరింది. అంతకుముందు 2% కంటే ఎక్కువ పడిపోయిన FTSE 100 సూచీ, ఇప్పుడు 0.5% పెరిగింది. అలాగే గ్యాస్ ధరలు కూడా క్షీణిస్తున్నాయి.

ఇరాన్ కు ట్రంప్ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం గడువు ఇవాళ ముగుస్తున్న నేపథ్యంలో సడన్ గా యుద్ద విరమణ ప్రకటన వచ్చింది. వాస్తవానికి ట్రంప్ ఇరాన్ లో విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేసుకుంటానని హెచ్చరించడంతో ఆ దేశం కూడా అంతకన్నా దీటుగా స్పందించింది. అదే జరిగితే గల్ఫ్ లో మీ విద్యుత్ ప్లాంట్లన్నీ నాశనం చేస్తానని ప్రతి హెచ్చరికలు చేసింది. అంతే కాదు హార్ముజ్ ను పూర్తిగా మూసేస్తామని, ఒక్క నౌక ను కూడా అనుమతించబోమని చెప్పేసింది. అన్నట్లుగానే ట్రంప్ ఇరాన్ పై దాడులకు దిగితే , ఇరాన్ కూడా చెప్పినట్లు చేస్తే ఇక అమెరికాపై తీవ్ర ఒత్తిడి ఖాయమని అంతా భావించారు. కానీ ట్రంప్ ప్రకటనతో పెద్ద ముప్పు తప్పింది. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో చమురు, గ్యాస్ ధరలు కూడా తగ్గుతున్నాయి.












Click it and Unblock the Notifications