రూ. 35 వేల కోట్లతో తిరుపతిలో టౌన్ షిప్ - నివాసాలు, డెస్టినేషన్ వెడ్డింగ్.. ప్రత్యేకతలు..!!
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొత్త టౌన్ షిప్ రాబోతోంది. ఆధ్యాత్మిక అంతర్జాతీయ టౌన్ షిప్ కు ఒప్పందం కుదిరింది. తిరుపతిలో డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. సుమారు రూ.35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఏపీ ప్రభుత్వం, టీటీడీ సహకారంతో ఈ టౌన్ షిప్ నిర్మాణం చేపడుతున్నారు.
తిరుపతిలో అధ్యాత్మిక టౌన్ షిప్ కు ఒప్పందం జరిగింది. డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నారు. డెల్లా టౌన్‌షిప్స్ సంస్థ 1,400 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. హిందూమతంపై ప్రపంచంలోనే తొలి 5,000 ఏళ్ల జీవన ప్రదర్శన (లివింగ్ ఎగ్జిబిషన్)ను ఏర్పాటు చేయనున్నారు. దీని మొత్తం స్థూల అభివృద్ధి విలువతో (GDP) కలిపి సుమారు రూ.35,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

డిజైన్ ఫ్యూచరిస్ట్, డెల్లా టౌన్‌షిప్స్ వ్యవస్థాపకులు జిమ్మీ మిస్త్రీ సహకారంతో ఈ టౌన్షిప్ నిర్మించనున్నారు. దీని ద్వారా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), రాష్ట్ర పర్యాటకశాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.
హిందూమతానికి సంబంధించిన విభిన్న జ్ఞాన పరంపరలు, సంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా వెల్లడిచారు. 300 ఎకరాల్లో లివింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక్కొక్కటి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 పెవిలియన్లు ఉంటాయి. సింధూలోయ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వచింతన వరకు కూడా భారత నాగరికతను ఇవి ప్రతిబింబిస్తాయి.
అదే విధంగా వేద విజ్ఞాన వ్యవస్థలు, ఆలయ నిర్మాణ శిల్పం, శాస్త్రీయ కళలు, ప్రాంతీయ సంప్రదాయాలు, ఆచారాలు వంటివి ప్రదర్శనలో ఉంటాయి. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆహ్వానించనున్నారు. లివింగ్ ఎగ్జిబిషన్‌తో పాటు విలాసవంతమైన నివాసాలు, ప్రైవేట్ విల్లాలు అభివృద్ధి చేయనున్నారు. 600కు పైగా గదులతో ఫైవ్ స్టార్ రిసార్ట్‌లు...డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు సైతం అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications