ఇంకెక్కడి దేశ్ కీ నేత కేసీఆర్; కనీసం ఏపీలోనైనా పోటీ చేస్తారా?
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాలను చేయడానికి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాలపై ఈ క్రమంలో ఫోకస్ చేసిన కేసీఆర్ మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలకు పర్యటన చేసి దేశ్ కి నేత కేసిఆర్ అని అనిపించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ఆశలను అడియాసలు చేశాయి. డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అన్న చందంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలు తలకిందులయ్యాయి. కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఓటమి పాలైన కేసీఆర్ దేశ రాజకీయాలు ఏం చేస్తాడు అన్న చర్చ జరుగుతుంది.

మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాలలో పోటీ చేస్తారా? ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ ప్రజలు కేసీఆర్ ను ఆదరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట్లోనే గెలవని కేసీఆర్ రచ్చ ఏం గెలుస్తాడు అని ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఓటమిపాలైన ఆయనను ఇతర రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్థానం ముగిసినట్టేనా.. అని చర్చిస్తున్నారు. మరొకపక్క వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా అన్న చర్చ సాగుతుంది.
జాతీయ పార్టీగా మనుగడ సాగించగలుగుతుందా అన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఇక తాజా పరిణామాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏం చేయబోతున్నారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఓటమి బాధని తట్టుకోలేకపోయిన కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
కనీసం తనకు ఓటు వేసిన ఓటర్లను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెళ్ళిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బ నుండి త్వరగా కోలుకుంటారా? మళ్ళీ దూకుడుగా రాజకీయాలు సాగిస్తారా? ఆయన బయటకు వచ్చేది ఎప్పుడు? ఆయన వ్యూహం ఏమిటి? అన్నది తెలియాల్సి ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications