కర్నూలులో మొదలైన వజ్రాల వేట .. గొర్రెల కాపరికి, వ్యవసాయ కూలీకి దొరికిన వజ్రాలు

తొలకరి మొదలైంది. తొలకరి జల్లులు కురిస్తే అంతా పొలం పనులు మొదలు పెట్టాలని భావిస్తారు కానీ కర్నూలు, అనంతపురం జిల్లాలలో మాత్రం వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఎంఫన్ తుఫాను కొనసాగుతుంది. ఇక దీని ప్రభావంతో అడపా దడపా వర్షాలు పడుతున్నాయి. ఇక దీంతో వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు .

Recommended Video

    Diamonds Hunt In Kurnool : Shepherd And Farm Laborer Found Diamonds

    రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు. ఇక తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం బొల్లవాని పల్లె గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఇక అతను ఆ వజ్రాన్ని ఆ గొర్రెల కాపరి రూ. 13 లక్షల 50 వేలు, ఐదు తులాల బంగారానికి ఓ వ్యాపారికి అమ్మినట్టు తెలుస్తుంది. ఇక ఆ వజ్రం విలువ సుమారు 60 లక్షలు ఉంటుందని అంటున్నారు.

     diamonds hunt in Kurnool.. a shepherd and farm laborer found diamonds

    అలాగే పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి కూడా ఒక వజ్రం లభించినట్టు సమాచారం . ఇక అతని వద్ద నుండి రూ. 1.50 లక్షలకు జొన్నగిరి వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అత్యంత విలువైన వజ్రాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వజ్రాల వ్యాపారులు ఇలా బహిరంగంగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+