హలో పవన్ కల్యాణ్ గారు: కొంచెం మీ భాయిజాన్ను చూసుకోండి ..!!
అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మాటల తీవ్రతను కొనసాగిస్తోన్నారు. మొన్నటివరకు తెలుగుదేశం పార్టీపై ఘాటు విమర్శలు సంధించిన ఆయన ఇప్పుడు తన రూటు మార్చారు. జనసేన పార్టీపై అస్త్రాలు ఎక్కు పెట్టారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్- చంద్రబాబుతో భేటీ కావడంపై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్, నాగబాబు వంతు వచ్చింది.

టీడీపీపై
తనను విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఈ మధ్య టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పై ఓ మినీ యుద్ధమే చేస్తోన్నారు రామ్ గోపాల్ వర్మ. ఒసేయ్ ఎంకమ్మ అంటూ మాటల ప్రతిదాడికి తెర తీశారు. బుద్ధా వెంకన్న తనను విమర్శించడాన్ని అదే స్థాయిలో తిప్పి కొట్టారు. తాను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్‌గా నాకానని, నువ్వు మాత్రం ప్రైవేట్‌గా నీ బాస్‌ను సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ.. అంటూ సెటైరికల్‌గా రెచ్చిపోయారు.

ఇప్పుడు నాగబాబుపై
కొద్దిసేపటి కిందటే రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కొణిదెల నాగబాబు గారూ.. అంటూ ఆయనపై మాటల తూటాలను సంధించారు. ఆయన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో గానీ తనకు కాదని స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీ మీద గానీ, పవన్ కల్యాణ్ మీద గానీ పెట్టిన ట్వీట్లు ఓ అభిమానిగా చేసినవేనని పేర్కొన్నారు.

అది పవన్ దురదృష్టం
తాను అభిమానిగా చేసిన ట్వీట్లు అర్థం కాకపోవడం తన దురదృష్టమని, తన కంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టమనీ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన అన్నయ్య కాబట్టి నాగబాబు లాంటి సలహదారులను మాత్రమే పెట్టుకోవడం వల్ల ప్రజల్లో ఆదరణను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాలపై పవన్ కల్యాణ్ ప్రభావం ఎలాంటిదనేది జనమే స్పష్టం చేస్తారని ఆర్జీవీ పేర్కొన్నారు.

ద్వారంపూడితో భేటీ..
అంతకుముందు రామ్ గోపాల్ వర్మ- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కలుసుకున్నారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయన విలేకురులతో మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, సంక్రాంతి సందర్భంగా వారు తనను పిలిస్తే ఇక్కడికి వచ్చానని వివరించారు.

చిరంజీవి పేరునూ..
నాగబాబు తన గురించి మట్లాడారో తెలియదని, దాని గురించి తాను వినలేదని చెప్పారు. వాటిని విన్న తరువాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా వాటిపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు. ఎలాంటి మొహమాటాలకు వెళ్లలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావనను కూడా పరోక్షంగా తీసుకొచ్చారాయన. చిరంజీవి, పవన్ కల్యాణ్ కు నాగబాబు ఇంపార్టెంట్ కావొచ్చేమో గానీ తనకు కాదని తేల్చిచెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications