ఆర్జీవీ మరో హాట్ ఫొటో- మా ఇష్టం
అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆయన ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. సహా పలువురు నాయకులపై చురకలు అంటిస్తుంటారు.
ఇటీవలే నిజం పేరుతో కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు ఆర్జీవీ. ఈ ఛానల్‌లో తొలి ఎపిసోడ్- వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం మీదే. వివేకా హత్య వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రబోధిస్తోన్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్లకు పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలను తవ్వి తీయడమే తన యూట్యూబ్ ఛానల్ నిజం ముఖ్యొద్దేశమంటూ లాంచింగ్ ప్రారంభంలోనే ప్రకటించారు.

రాజకీయాలతో పాటు సెలెబ్రిటీలతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగే రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల కిందటే కొత్త వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. నటి అషురెడ్డి కాళ్లు పాదాలను జుర్రుతూ పోస్ట్ చేసిన ఓ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేసింది. ఈ వ్యవహారం అటు రాజకీయంగా కూడా వివాదాస్పదమైంది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా విమర్శించారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కొద్దిరోజుల పాటు వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఓ మినీ యుద్ధమే నడిచింది. తనకు అమ్మాయిలు, వాళ్ల కాళ్లు నాకడం అంటే ఎంతో ఇష్టమని, ఎవరో, ఏదో అనుకుంటారనే కారణంతో తన ఇష్టాన్ని వదులుకోబోనంటూ తేల్చేశారాయన.
ఇప్పుడు తాజాగా మరో హాట్ ఫొటోను షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ. నటి అప్సర రాణితో కలిసి దిగిన ఓ బోల్డ్ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆమె పుష్ప హీరో బన్నీకి సూపర్ ఫ్యాన్, నేను బన్నీకి డూపర్ ఫ్యాన్.. అంటూ క్యాప్షన్‌ను జోడించారు. అప్సర రాణి నటించిన సినిమా మా ఇష్టం. నైనా గంగూలీ, పలక్ సింగ్, మిథున్ పురందరె, రాజ్‌పల్ యాదవ్ నటించారిందులో.












Click it and Unblock the Notifications