తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Taraka Ratna Assets: మూడు వారాలకు పైగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్నచికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. బంధు మిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తారకరత్న ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. మొత్తం ఎన్ని కోట్లు అంటే.. నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది కథానాయకులు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విజయం అందుకోనిది తారకరత్న ఒక్కడే. నందమూరి మోహన్ కృష్ణ తనయుడైన తారకరత్న శివరాత్రి రోజు శివైక్యం చెందారు.

స్టార్ కథానాయకుడు కాలేకపోయాడు
నందమూరి కుటుంబం నుంచి స్టార్ కథానాయకులుగా బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను సొంతం చేసుకున్నారు. తారకరత్న పుట్టినరోజు 22 జనవరి 1983. జన్మించిన తేదీకి నాలుగు రోజులు ముందే కన్నుమూయడం అత్యంత విషాదకరంగా నిలిచింది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన నెలన్నర వ్యవధిలో తారకరత్న జన్మించారు. చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అందుకే హీరోగా సినిమాలు చేయడమే మానేసిన తారకరత్న వైపు నిర్మాతలు కూడా చూడటం మానేశారు.

బాబాయితో కలిసి నటించాలనే కోరిక
తన బాబాయి బాలయ్యతో కలిసి నటించాలనే కోరిక ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలో తారకరత్నను ప్రతినాయకుడిగా తీసుకోవాలని బాలయ్య అనుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండా అనంతలోకాలకు ఆయన వెళ్లిపోయారు. మరోవైపు నుంచి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లాలనే కోరిక కూడా ఉంది. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఎవరైనా కార్యకర్తలు పిలిస్తే వెళ్లిపోయే తారకరత్నకు పార్టీమీద అభిమానం చెక్కుచెదరనది.

రూ.1500 కోట్లకు పైగా ఆస్తులు
తారకరత్న మృతిచెందడంతో ఆయన ముగ్గురు పిల్లల బాధ్యతలను బాబాయి బాలకృష్ణ తీసుకున్నారు. తారకరత్నకు మొదట కూతురు తర్వాత ఇద్దరు కవల పిల్లలున్నారు. కవలల్లో ఒక ఆడపిల్ల.. మరో మగ పిల్లాడున్నారు. ఇకనుంచి వాళ్ల ఆలనా పాలనా బాలయ్య చూసుకోనున్నారు. తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ కు హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్స్‌తో పాటు తారకరత్న థియేటర్స్, కొన్ని హోటల్ బిజినెస్‌లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం చేస్తున్నారు. వీరి ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్‌లు అన్ని కలిపి దాదాపు మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్లరూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.అటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరిట తల్లిదండ్రుల నుంచి దాదాపు రూ. 250 కోట్ల వరకు ఆస్తులున్నట్టు సమాచారం. తారకరత్నకు మొత్తం రూ. 1500 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు వాళ్ల సన్నిహితులు చెబుతారు.

అమరావతిలో విలన్ గా..
2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు ప్రారంభించారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నా ఆ 9 సినిమాల్లో 6 సినిమాలు పట్టాలెక్కలేదు. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోవడంతో తారకరత్న కూడా కనిపించలేదు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో విలన్ గా మారారు. ఈ సినిమాకు నందిఅవార్డు కూడా తారక్ తీసుకున్నారు.
23 చిత్రాల్లో నటించిన తారకరత్న ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న కూతురు పేరు నిష్క.. ఇద్దరు కవల పిల్లల్లో ఒక మగ పిల్లాడు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి ఉన్నారు.9 సినిమాల హీరో అనే ముద్ర మాత్రం తారకరత్నపై అలాగే ఉంది. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తరుణంలోనే ఆ కోరిక తీరకుండానే కన్నుమూయడం అత్యంత విషాదకరంగా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications