ఈ నెంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తే.. మీరే నేరస్తులు!
రోజురోజుకీ సైబర్ నేరాలు డబ్బులు దోచుకునే స్థాయి నుంచి మనల్ని నేరస్తులను చేసే స్థాయికి పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్ కి వచ్చే మెసేజ్ చూడాలన్న, వాట్సాప్ లో వచ్చిన సందేశాలను చూడాలన్న భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజల యొక్క అవసరాలను బట్టి వాటిని ఆసరా చేసుకుని కొత్త కొత్త సైబర్ స్కాములకు తెరతీస్తున్న సైబర్ నెరగాళ్లు ఇప్పుడు ఏకంగా ఫోన్ కాల్స్ చేసి మరీ నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఈ దేశాల కోడ్స్ తో ఫోన్ కాల్స్ వస్తున్నాయా?
లాత్వియా, సెర్బియా, లిథువేనియా, టాంజానియా, బెలారస్, లోవా వంటి దేశాల కోడ్లతో మొదలయ్యే ఫోన్ నెంబర్లతో కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మన మొబైల్ ఫోన్లో ఉన్న డేటాను సెకండ్లలో చోరీ చేయడంతో పాటు వాటి ద్వారా సైబర్ క్రైమ్ చేసి మనల్ని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు .ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు.

ఈ కాల్స్ పొరబాటున కూడా అటెండ్ చెయ్యొద్దు
అపరిచిత నెంబర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దని ఒకవేళ రిసీవ్ చేసుకుంటే సెకండ్లలోనే డేటాను చోరీ చేసి మిమ్మల్ని కటకటాల పాలు చేసే ప్లాన్ తో సైబర్ నేరగాళ్లు రెడీ అయ్యారని హెచ్చరిస్తున్నారు. +37052529259,+56322553736,+255901130460,+94777 455913,+37127913091 వంటి నెంబర్లతో ఫోన్ చేస్తే ఎత్తకూడదని హెచ్చరిస్తున్నారు.
ఫోన్ లిఫ్ట్ చేస్తే జరిగేదిదే
ఒకవేళ ఈ నెంబర్లతో వచ్చిన ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేస్తే వారు మన ఫోన్లోని కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇతర వివరాలను కేవలం మూడు సెకండ్లలోనే కాపీ చేసుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తద్వారా మీ సిమ్ కార్డును వారు యాక్సెస్ చేసి దానితో నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
మిమ్మల్ని క్రిమినల్స్ చేసే ప్లాన్ ... జాగ్రత్త
మిమ్మల్ని నేరస్తులుగా చేసి తమ పని చేసుకుంటారని కనుక అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అందుకే ఈ నెంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్ పై తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా సరే ప్రజలలోనూ వీటిపై అవగాహన ఉండాలని, లేదంటే సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి మోసపోయే ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్త.












Click it and Unblock the Notifications