• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్ర‌బాబు మాట‌ల్లో అంత‌ర్యం : అస‌హ‌న‌మా..ఆవేద‌నా..అప్ర‌మ‌త్త‌తా..!!

|

నేను ప్ర‌ధాని అవుతా అని ఎవ‌రూ అన‌ద్దు. పార్టీ నేత‌లకు టిడిపి అధినేత చంద్ర‌బాబు హుకుం. ప్ర‌స్తుతం బిజెపికి వ్య‌తిరే కంగా దేశంలోని పార్టీల‌ను ఒక్క తాటి పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అదే స‌మ‌యం లో ఏపిలో అధిక ఎంపీ సీట్లు వ‌స్తే చంద్ర‌బాబు ప్ర‌ధాని అవుతార‌ని..గ‌తంలో దేవ‌గౌడ సైతం ఇలాగే ప్ర‌ధాని అయ్యార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. అయితే, తాను దేశం కోసం మాత్ర‌మే ప‌ని చేస్తున్నాన‌ని..ప్ర‌ధాని ఆలోచ‌న లేద‌ని టిడిపి అధినేత స్ప‌ష్టం చేస్తున్నారు. త‌న సేవ‌లు ఏపికి అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. అస‌లు..చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల వెనుక ఉన్న వ్యూహం ఏంట‌నేది ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌.

బాబు లో అస‌హ‌నానికి కార‌ణ‌మా...

బాబు లో అస‌హ‌నానికి కార‌ణ‌మా...

ప్ర‌ధాని మోదీ అవిశ్వాసం కు స‌మాధానం ఇచ్చే సంద‌ర్భంలో కెసిఆర్ ను అభినందించిన ప్ర‌ధాని మోదీ త‌న‌ను అవ‌మా నించేలా మాట్లాడారాని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీని కార‌ణంగానే తెలంగాణ‌లో అనూ హ్యంగా కాంగ్రెస్ తో చేతులు క‌లిపి..అక్క‌డ కెసిఆర్ ను ఓడించాల‌ని..త‌ద్వారా త‌న శక్తి ఏంటో తెలియ‌చేయాల‌ని సీయం ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా త‌న ప‌లుకుబ‌డి ఏంటో చూపించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. జాతీయ నేత‌లు సైతం త‌న‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితుల్లో త‌మ పార్టీకి చెందిన నేత‌లే చంద్ర‌బాబుకు ప్ర‌ధాని అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్ప‌టం ద్వారా న‌ష్టం చేస్తుంద‌నే భావ‌న‌లో ఏపి సీయం ఉన్నారు. ఇప్ప‌టికే..చంద్ర‌బాబు ఢిల్లీ స్థాయిలో చేసింది ఏమీ లేద‌ని..ఇప్ప‌టికే యుపిఏ లో ఉన్న రాజ‌కీయ పార్టీ ల నేత‌ల‌ను క‌లిసి..బిజెపి వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు చేస్తున్నాన‌ని చెబుతున్నారంటూ విప‌క్ష పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి. దీనికి తోడు..కాంగ్రెస్ తో అనూహ్య ప‌ర‌స్థితుల్లో జ‌త క‌ట్టిన చంద్ర‌బాబు కు ఏపిలో ఆ నిర్ణ‌యం ఏ మేర‌.. ఎటువంటి ప్రభావం చూపుతుంద‌నే ఆందోళ‌న ఉంది. ఏపి ముఖ్య‌మంత్రి గా వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారుతున్న స‌మ‌యంలో ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ప్ర‌చారం చేయ‌టం ద్వారా మొత్తానికే మోసం వ‌స్తుంద‌నే ఆలోచ‌న‌లో భాగంగానే చంద్ర‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లు చేసుంటార‌ని తెలుస్తోంది.

ఇందులో దాగున్న ఆవేద‌న మ‌రో కార‌ణం...

ఇందులో దాగున్న ఆవేద‌న మ‌రో కార‌ణం...

గ‌తంలోనే త‌న‌కు ప్ర‌ధాని అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. గ‌తంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అప్పుడే చంద్ర‌బాబు కు ప్ర‌ధాని అవ‌కాశం వ‌చ్చిం ద‌ని పార్టీ నేత‌లు చెబుతారు. కానీ, ఇప్పుడు బిజెపి కి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు చేస్తున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌ధాని అవుతారంటూ ప్ర‌చారం చేయ‌టం ద్వారా..త‌ను వ్య‌తిరేక ప‌క్షాల‌కు మ‌రింత‌గా కార్న‌ర్ అవుతాన‌నే ఆందోళ‌న క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో..జాతీయ స్థాయిలో ఉన్న ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు సైతం ఈ ప్ర‌చారాన్ని సీరియ‌స్ గా తీసుకుంటే మొత్తానికే న‌ష్టం జ‌రుగుతుంద‌నే ఆవేద‌న బాబు లో ఉంద‌నేది మ‌రో విశ్లేష‌ణ‌. ఇప్ప‌టికే మ‌మ‌తా బెన‌ర్జీ, శ‌ర‌ద్ ప‌వార్‌, ములాయం, మాయావ‌తి లాంటి నేత‌లు ప్ర‌ధాని కావాల‌నే ఆశ‌ల్లో ఉన్నారు. ఇప్పుడు వారంతా ఈ ప్ర‌చారం కార‌ణంగా త‌మ ఆలోచ‌న‌లు మార్చుకుంటే త‌న నాయ‌క‌త్వ ప‌టిమ‌కు జాతీయ స్థాయిలోనే ఇబ్బందులు వ‌స్తాయ‌నేది చంద్ర‌బాబు ఆవేద‌న‌. దీని కార‌ణంగా..కొత్త స‌మ‌స్య‌లు కొని తెచ్చుకోవ టం చంద్ర‌బాబుకు ఇష్టం లేదు. అందునా..తెలంగాణ లో న‌ష్ట పోయిన టిడిపి ఇప్పుడు కాంగ్రెస్ తో జ‌త క‌ట్టాల్సిన ప‌రి స్థితి ఏర్ప‌డింది. ఏపిలో టిడిపి బ‌లంగా ఉన్నా..వ‌చ్చే ఎన్నిక‌లు పార్టీ భ‌విష్య‌త్ ను నిర్ధేశించ‌నున్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో త‌న‌ను ప్ర‌ధాని అవుతారంటూ ఎవ‌రూ అన‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా నిర్ధేశం చేస్తున్నారు.

అప్ర‌మ‌త్త‌త లో భాగంగానే..

అప్ర‌మ‌త్త‌త లో భాగంగానే..

రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ఫోక‌స్ చేయ‌టం ద్వారా లాభం కంటే త‌న పార్టీకి..త‌న‌కు న‌ష్ట‌మే ఎక్కువ‌ని అంచ‌నా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో బిజెపి బ‌లంగా ఉంది. అదే స‌మయంలో బిజెపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఒక వైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్ర‌ధాని అభ్య‌ర్ధి గా ఆ పార్టీ ప్ర‌చారం చేసుకుంటున్న స‌మ‌యంలో..వారితో క‌లిసి ఉంటూ తాను ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా ప్ర‌చారం జ‌రిగితే త‌న ప్ర‌య‌త్నాల‌కు ఆది లోనే గండి ప‌డే అవ‌కాశం ఉంది. ఇత‌ర జాతీయ నేత‌లూ దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. దీనికి తోడు తాను జాతీయ స్థాయిలో నిల‌బ‌డాలంటే..త‌న‌కు ఏపిలో వ‌చ్చే ఎంపీ సీట్లు కీల‌కం. అందునా టిడిపి కి ఇప్పుడు మిగిలిన ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌లు ఫ్యూచ‌ర్ ను డిసైడ్ చేయ‌నున్నాయి. త‌న‌ను చూసి మాత్ర‌మే టిడిపికి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌నే విష‌యం చంద్ర‌బాబుకు బాగా తెలుసు. తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ప్రచారం జ‌రిగితే..ఏపిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి న‌ష్టం చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తాను ఏపి రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతాన‌ని చెప్ప‌టం ద్వారా ఇక్క‌డ మైలేజ్ సాధించ‌వ‌చ్చ‌ని బాబు అంచ‌నా. అదే స‌మ‌యంలో ప్ర‌ధానిగా అవ‌కాశం ఉన్నా..ఏపికే ప‌రిమితం అవుతున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లగ‌టం ద్వారా రాజ‌కీయంగా మేలు జ‌రుగుతుంద‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది. దీంతో...అన్ని ర‌కాలుగా అప్ర‌మ‌త్త‌తోటో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

English summary
Tdp president Chandra Babu Naidu ordered party leaders to do not project him as future Prime Minister. This type of comments may cause political damage to party and personally to him. But, seems to b many equations behind Naidu comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X