డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్: ఔటర్‌పై దోపిడీ

Drugs Racket
హైదరాబాద్: మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 120 గ్రాముల కెటమైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఔటర్ రింగు రోడ్డుపై దోపిడీ

ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి దొంగలు ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ. 3.8 లక్షలు ఎత్తుకెళ్లారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్ చెరువు నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా నల్లగొండ వెళుతున్న ఓ ట్రాన్స్ పోర్ట్ లారీని కారులో వచ్చిన దొంగలు అడ్డగించారు. లారీ డ్రైవర్‌ను చితకబాది అతని వద్ద ఉన్న రూ. 3.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ లింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

లారీని కూడా దోపిడీ దొంగలు రాళ్లతో ధ్వంసం చేశారు. లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్, సైబరాబాద్ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు. ఔటర్ రింగు రోడ్డుపై టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు.

నూనె మిల్లులో అగ్ని ప్రమాదం

జిల్లాలోని పలాస పారిశ్రామిక వాడలోని కల్పధ్రువ జీడి నూనె మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన కార్మికులు, పరిశ్రమ నుంచి బయటికి పరుగులు తీశారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల కార్మికులు కూడా భయాందోళనకు గురయ్యారు. కాశీబుగ్గ, సోంపేట నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+