Pawan Kalyan: పిఠాపురం ఈవీఎంలో పవన్ నంబర్ ఎంతో తెలుసా ?
ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపుతున్న నియోజకవర్గం పిఠాపురం. కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు సంకేతాలు రాగానే వైసీపీ అలర్ట్ అయింది. కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో పోటీకి నిలబెట్టింది. తద్వారా వీలైతే పవన్ కళ్యాణ్ ను ఓడించాలని, కుదరకపోతే కనీసం మెజార్టీని అయినా కనీసానికి పరిమితం చేయాలని భావించింది. దీంతో పిఠాపురం పోరు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది.
మరి ఇంత ఉత్కంఠ రేపుతున్న పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల పోరులో పవన్ కళ్యాణ్ తాజాగా నామినేషన్ వేయడం, దాన్ని రిటర్నింగ్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈవీఎంపై పవన్ కళ్యాణ్ కు ఏ స్ధానం కేటాయించారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి తెరదించుతూ పవన్ సోదరుడు నాగబాబు అధికారికంగా పవన్ కు ఈవీఎంపై ఏ స్దానం కేటాయించారో ఎక్స్ లో పోస్టు పెట్టారు.

జనసేన పిఠాపురం అభ్యర్థి : *కొణిదెల పవన్ కళ్యాణ్*
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 30, 2024
*EVM బ్యాలెట్ నెంబర్ : 04*#VoteForGlass #PawanKalyanWinningPithapuram#Pithapuram pic.twitter.com/vYmNTbBiud
దీని ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఎన్నికల అధికారులు ఈవీఎంపై నాలుగో స్ధానం కేటాయించారు. తొలి ముగ్గురు అభ్యర్ధులు ఎవరో తెలియదు కానీ.. పవన్ కు మాత్రం నాలుగో నంబర్ ఇచ్చారు. దీంతో పవన్ కు ఓటేయాలనుకునే వారు ఈవీఎంలో నాలుగో స్ధానంలో ఉన్న ఆయన పేరుకు ఎదురుగా ఉన్న బటన్ పై నొక్కి ఓటు వేయాల్సి ఉంటుంది. పిఠాపురంలో ఈసారి గాజు గ్లాసు గుర్తు పవన్ కు మాత్రమే కేటాయించడంతో ఇక మరే ఇతర ఇబ్బందులు కూడా లేవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications