జగన్ ఎఫెక్ట్:: ఈసీ ఏం చేయనుంది? వైసీపీకి టిడిపి చెక్ ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై రెండో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ చీఫ్ జగన్‌పై ఎన్నికల కమిషన్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటోందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్‌పై కఠినంగా వ్యవహరించాలని టిడిపి నేతలు ఈసీనీ కోరారు.

జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

అయితే ఈ నెల 3వ, తేదిన నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ చీఫ్ జగన్ పాల్గొన్నారు. ఈ సభ వేదికగానే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వైసీపీపై టిడిపి మరో అస్త్రం: ఆ నివేదిక రాక ముందే జగన్‌పై ఇలా..

ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు సీరియస్ అయ్యారు.ఈ వ్యాఖ్యలపై ఈసీ జగన్‌ను వివరణ కోరింది. అయితే జగన్ ఈసీకి వివరణ పంపారు. ఆ తర్వాత మరోసారి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇచ్చిన హమీలను నెరవేర్చని చంద్రబాబునాయుడును ఉరితీసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

వ్యక్తులకే ప్రాధాన్యత, ఎవరికీ దక్కని హ్యట్రిక్, సంచలనాలే నంద్యాల చరిత్ర

ఈసీ ఏం చేయనుంది?

ఈసీ ఏం చేయనుంది?

ఈ నెల 3వ, తేదిన నంద్యాలలో చంద్రబాబును కాల్చి చంపిన తప్పేమీ లేదని వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. దీంతో ఈసీకి జగన్ తన వివరణను పంపారు. అయితే ఈ వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్‌ నుండి నివేదిక రావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో మరోసారి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళుగా తాను ఇచ్చిన హమీలను నెరవేర్చని బాబును ఉరితీసిన తప్పేమీ లేదన్నారు.ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడ్డారు. టిడిపి నేతలు మరోసారి ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదుచేశారు.అయితే ఈ వ్యాఖ్యలపై జగన్‌పై ఈసీ ఏ రకమైన చర్యలను తీసుకొంటోందోననే ఉత్కంఠ నెలకొంది.

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
జగన్‌కు చెక్ పెట్టేందుకు టిడిపి ఇలా

జగన్‌కు చెక్ పెట్టేందుకు టిడిపి ఇలా


వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు మంచి అవకాశమని టిడిపి నేతలు భావిస్తున్నారు నంద్యాల సభలో చంద్రబాబును కాల్చి చంపినా తప్పు లేదని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు జగన్ వ్యక్తిత్వం ఏ రకమైందో బయటపడిందంటూ విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌ను హైద్రాబాద్‌కు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆనాటి పరిస్థితులను టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నెల 3వ, తేదిన జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జగన్ తీరును తప్పుబట్టారు.

ఈసీ నిర్ణయం కోసం చూస్తున్న టిడిపి నేతలు

ఈసీ నిర్ణయం కోసం చూస్తున్న టిడిపి నేతలు

జగన్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై టిడిపి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటోందని టిడిపి వేచి చూస్తోంది. ఈ రకమైన వ్యాఖ్యలపై సహించేది లేదని టిడిపి నేతలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా

ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా

వైసీపీ చీఫ్ జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రశాంత్‌కిషోర్‌ను వ్యూహకర్తగా కూడ నియమించుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అన్ని రకాల వ్యూహలను అనుసరిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికలు రిహర్సల్స్ వంటివనే అభిప్రాయం కూడ లేకపోలేదు. దరిమిలా ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election commission what type of action take on Ysrcp chief Ys Jagan.Ys Jagan sensational comments on Ap cm Chandrababu Naidu on Thursday.
Please Wait while comments are loading...