షర్మిలతో జగన్ కు మేలే జరిగిందా, కానీ - అక్కడ దెబ్బ కొట్టింది..!!

ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ తాను 2019 కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తానని చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏంటనేది ఎన్నికల సరళి పైన విశ్లేషణ లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కడప లో షర్మిలకు వచ్చే ఓట్ల గురించి ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ షర్మిల ప్రభావం ఏ స్థాయిలో కనిపించింది.

షర్మిల ప్రభావం
పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ పైన దూకుడుగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీనే లక్ష్యంగా చేసుకున్నారు. వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ పైన ఆరోపణలు చేసారు. వైసీపీలో సీట్లు నిరాకరించిన వారికి కాంగ్రెస్ లో సీట్లు కేటాయించారు. ఇక, కడప లో షర్మిల ప్రభావం ఎవరికి గండి కొట్టిందనే చర్చ మొదలైంది. కడప పార్లమెంట్ కు షర్మిల పోటీ చేసారు. వైసీపీ నుంచి అవినాశ్ పోటీలో నిలిచారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని అవినాశ్ ప్రయత్నించారు. కపోలింగ్ సరళిలో కీలక అంశాలు గుర్తించారు.

Electoral Dynamics The influence of Sharmila on Jagans YSRCPs Success and Challenges

వైసీపీ ఓట్లను చీల్చారా
కడప ఎంపీగా షర్మిల కు డిపాజిట్లు దక్కవని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, షర్మిల కడప ఎంపీగా పోటీ చేయగా..టీడీపీ కేడర్ సైతం సహకరించినట్లు చర్చ ఉంది. టీడీపీ ఎంపీగా భూపేశ్ రెడ్డి పోటీ చేసారు. దీంతో, త్రిముఖ పోటీ నెలకొంది. కడప, పులివెందుల, ప్రొద్దుటరు, జమ్మల మడుగులో ఎమ్మెల్యే ఓట్లు ఎక్కువ సంఖ్యలో టీడీపీ, వైసీపీకి పోలయ్యాయి. అయితే, ఎంపీ ఓట్ల విషయంలో మాత్రం వైసీపీ తరువాత స్థాయిలో కాంగ్రెస్ కు ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సరళి స్పష్టం చేస్తోంది. ఇక...కాంగ్రెస్ అభ్యర్దులు కొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను సాధించారని తెలుస్తోంది.

Electoral Dynamics The influence of Sharmila on Jagans YSRCPs Success and Challenges

నష్టం ఎవరికి
షర్మిల ప్రచారం..పోటీ ద్వారా వైసీపీ ఓట్ బ్యాంక్ కు గండి పడుతుందనే ప్రచారం సాగింది. కానీ, ఎన్నికల సరళి గమనించిన తరువాత వైసీపీకి నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ఓట్లు పోలవ్వలేదనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, చీరాల, శింగనమల, కోడుమూరు వంటి నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కు మంచి ఓటింగ్ జరిగిందని విశ్లేషిస్తున్నారు. దీంతో..అసలు షర్మిల ప్రభావం టీడీపీ, కాంగ్రెస్ పైన ఎలాంటి ప్రభావం చూపించిందనే లెక్కలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. అయితే, పూర్తి స్థాయి లెక్కలు మాత్రం జూన్ 4న వెల్లడి తరువాతనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+