ఎస్మాకు భయపడేది లేదు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం : ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పాయి. తమపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావొద్దన్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టొదన్నారు. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. పీఆర్సీ రద్దు చేసేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం

ఉద్యోగులు చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్ వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే తాము నాలుగు అడుగులు ముందుకు వేస్తామన్నారు. కానీ లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాదానం చెప్పాలని ప్రభుత్వాన్ని బొప్పరాజు డిమాండ్ చేశారు.

మూడేేళ్లుగా తిరిగాం.. ఇంకా మోసం చెయ్యొద్దు

మూడేేళ్లుగా తిరిగాం.. ఇంకా మోసం చెయ్యొద్దు

గత మూడేళ్లుగా తమకు రావాల్సిన హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చూట్టూ తిరిగాం.. ఇంకా మోసం చెయ్యొద్దన్నారు బొప్పారాజు. తమకు రావాల్సిన హక్కుల కోసం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయులను, పెన్షనర్లను, కార్మికులను కలుపుకోని తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 3న లక్షలాది మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

 మాలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుంది

మాలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుంది

మరోవైపు ఉద్యోగులలో ఉన్న అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుందని సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ ఇలా రావడానికి తమ ఉద్యోగ సంఘాల తప్పు కూడా ఉందని పేర్కొన్నారు. తమలో ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు నష్టం కలిగించాయని తెలిపారు. ఇకపై ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పోరాటం చేస్తామని చెప్పారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నివారిచడమనేది.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త పీఆర్సీ రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+