చేతగాని పోటుగాడు సీఎం జగన్ .. అఖిల పక్షం పెట్టి ఆ లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్
టిడిపి నేత ,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ కు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు , ఆర్థిక శాఖ కార్యదర్శికి సవాల్ విసిరారు. అసలు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయా ? ఆదాయం ఎంత ? ఖర్చు ఎంత ? చెప్పగలరా అంటూ నిలదీశారు.

జగన్ తీరుతో రాష్ట్రమంతా అడుక్కు తింటుంది
డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అంటూ ప్రశ్నించారు. జగన్ తీరుతో రాష్ట్రమంతా అడుక్కు తింటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి, కార్యదర్శులతో పాటు, సీఎం జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాట్లాడగలరా అంటూ సవాల్ విసిరారు అయ్యన్నపాత్రుడు. అంతేకాదు సీఎం జగన్ దోపిడీలో నంబర్ వన్ , దానిలో అనుమానం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒక దొంగ సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూస్తున్నాం
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని , కానీ ప్రభుత్వ తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని అయ్యన్న వ్యాఖ్యానించారు . పనికిమాలిన చేతగాని పోటుగాడు సీఎం జగన్ అంటూ అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనను సీఎం జగన్ ఖండించకపోవడం దారుణమని ఇది దుర్మార్గపు చర్య అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఒక దొంగ సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూస్తున్నామని విమర్శించారు.

ఆలయాల్లో విగ్రహ ధ్వంసాలు, దాడులపై అయ్యన్న ఆగ్రహం
దొంగ లెక్కలు చెప్పటంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఘనాపాటి అంటూ విజయసాయి రెడ్డిని సైతం టార్గెట్ చేశారు. ఇక మాన్సస్ చైర్పర్సన్ సంచయిత గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆమె రామతీర్ధంలో విగ్రహ ధ్వంసం ఘటనపై స్పందించకపోవడం దారుణమన్నారు. అశోకవనంలో ఆమె గంజాయి మొక్క అని అభివర్ణించారు అయ్యన్నపాత్రుడు. రాష్ట్ర వ్యాప్తంగా 125 దేవాలయాలపై దాడులు జరిగితే డిజిపి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు, వైసిపి హయాంలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications