అక్రమ సంబంధం?: మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు.

కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. పాణ్యం సిఐ పార్థసారథి రెడ్డి, నందివర్గం ఎస్ఐ శంకరయ్య పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశించారు.

శవం ఇలా కనిపించింది..

శవం ఇలా కనిపించింది..

వ్యక్తిని మర్మాంగాలు కోసి, శనగకర్ర వేసి పెట్రోలు పోసి తగులబెట్టిన ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. మృతదేహం దగ్ధం కావడంతో గుర్తించడం కాస్తా కష్టంగా మారింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. అతను తమ విఠలాపురం గ్రామవాసి అని, చెన్నయ్య కుమారుడు మాల కొప్పెర పెద్ద చెన్నయ్య (35) అని చెప్పారు.

ఇలా దర్యాప్తు ప్రారంభం

ఇలా దర్యాప్తు ప్రారంభం

మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలానికి కర్నూలు నుంచి క్లూస్ టీమ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద చెన్నయ్య హత్యకు వివాహేతర సంబందమే కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పార్థసారథి చెప్పారు.

ఆమెతో ఇలా వివాహం..

ఆమెతో ఇలా వివాహం..

చెన్నయ్యకు నంద్యాల మండలం బల్లలాపురం గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వారి కూతురు 9వ తరగతి చదువుతోంది. చెన్నయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, దానిపై పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని అంటున్నారు. దాంతో నాలుగేళ్లుగా చెన్నయ్య దంపతులు గ్రామానికి దూరంగా ఉన్నారు.

మళ్లీ ఇలా వచ్చారు...

మళ్లీ ఇలా వచ్చారు...

ఏడాది క్రితం చెన్నయ్య దంపతులు విఠలాపురం గ్రామానికి తిరిగి వచ్చారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద చెన్నయ్యను హత్య చేశారు. ఆ అక్రమ సంబంధం కారణంగానే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man Pedda Chennaiah has been killed after chopping off private parts in Kurnool district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి