డాక్టర్ వేషంలో కి'లేడీ' గాంధీలో చేతివాటం (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కిలాడీ లేడీ చాలకీతనం ప్రదర్శించింది. సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వేషంలో వచ్చిన మాయలాడి అందిన కాడికి మహిళా డాక్టర్ల బ్యాగులు నొక్కేసింది.
దాదాపు పది మంది హ్యాండ్ బ్యాగ్ లను సర్దేసిన ఆమె చల్లగా జారుకుంటుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె బ్యాగ్‌ను వారు తనిఖీ చేయడంతో స్టెతస్కోపు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు దర్శనమిచ్చాయి.

దీంతో, ఆగ్రహం చెందిన మహిళా డాక్టర్లు ఆమెకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆ మాయలేడిని శైలజగా గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.













Click it and Unblock the Notifications