విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అదితి' కోసం ఆన్‌లైన్ అన్వేషణ, నెట్లో సెల్ఫీ వీడియో, తండ్రికి చంద్రబాబు హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖలో ఆరేళ్ల బాలిక అదితి డ్రయినేజీలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతై అయిదు రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా గాలింపు చర్యలు ప్రారంభించారు.

సోమవారం నాడు 'ఫైండింగ్ అదితి' పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతాను తెరిచారు. ఈ నెల 24వ తేదీ నుంచి అదితి కనిపించడం లేదని, ఆ రోజున ఆమె గులాబీ రంగు గౌను, గులాబీ రంగు పాఠశాల సంచితో ఉందని, ఆచూకీ తెలిసిన వారు తప్పకుండా సమాచారం ఇవ్వగలరని అదితి బాబాయి ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.

Family of six year old girl washed away in Vizag drain, takes search online

ఇందులో అదితి గల్లంతైన రోజున తీసుకున్న సెల్ఫీ వీడియోలను ఉంచారు. ఈ ఖాతాను ప్రారంభించిన గంటల వ్యవధిలోనే లైక్‌లతో పలువురు సంఘీభావం తెలిపారు.

ఈ ఘటన చోటు చేసుకున్న రోజు నుంచి విశాఖలో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవిఎంసీ)తో పాటు నౌకాదళం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మురుగు కాలువ గెడ్డలు, సముద్ర గర్భం, తీరాల్లో జల్లెడ పడుతున్నారు.

సోమవారం నాడు గెడ్డల్లోకి వచ్చే మురుగు నీటిని సైతం నిలిపి వందమంది పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి వెతికారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. పోలీసులు అపహరణ కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే, ఆమె ఇప్పటికీ చిక్కడం లేదు.

చంద్రబాబును కలిసిన అదితి తండ్రి

అదితి తండ్రి మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు.

Please share any updates and information on this page or on the website www.findingaditi.org. Every single suggestion,...

Posted by Finding Aditi - missing from Visakhapatnam since 24th Sept onMonday, September 28, 2015

English summary
Family of six year old girl washed away in Vizag drain, takes search online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X