ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!!
సీనియర్ నటులు చంద్ర మోహన్ ఈ ఉదయం కన్ను మూశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లోనే చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలంగా చంద్రమోహన్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంత కాలం వెంటిలేటర్ పైన చికిత్స అందించారు.
1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రారంభంలో చంద్రమోహన్‌తో నటించి, తరువాత ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడుగా గుర్తింపు పొందారు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం నిలిచిపోతారు. చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. చంద్రమోహన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఇంటికి ప్రముఖులు తరలి వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications