రైళ్ళలో ఫ్యాన్ లను అస్సలు దొంగతనం చెయ్యలేరు.. ఎందుకో తెలుసా!!
ఇండియన్ రైల్వే రైళ్లలో ప్రయాణించే వారికి అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రయాణికులు సులభంగా ప్రయాణం చేయడానికి వీలుగా అనేక ఏర్పాట్లను చేస్తుంది. టాయిలెట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లైట్లు కూడా అమరుస్తుంది. అంతే కాదు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా చార్జింగ్ పాయింట్స్ ను కూడా రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.
రైళ్ళ ప్రయాణం తర్వాత, ఖాళీగా పక్కన పెట్టినప్పటికీ ఎవరు వాటిలోని ఫ్యాన్ లను దొంగతనం చెయ్యలేరు. అందుకు ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. రైళ్లలో స్లీపర్ క్లాసులు, జనరల్ బోగిలలో ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్ లను ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. ఇవి ప్రయాణ సమయంలో వేడి నుండి చెమట నుండి ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తాయి.

అయితే రైల్వే ఫ్యాన్లు దొంగతనం చేసినట్టు ఎప్పుడైనా వార్తలు విన్నారా? ఖచ్చితంగా విని ఉండరు. ఎందుకంటే రైళ్లలో ఏర్పాటు చేసే ఫ్యాన్లు దొంగతనం చెయ్యలేరు. దాని వెనుక ఉన్న సాంకేతికత అటువంటిది. రైళ్లలో అమర్చిన ఫ్యాన్లు రైళ్లలో మాత్రమే పనిచేస్తాయి. ఈ ఫ్యాన్ లను రైళ్ల నుంచి బయటకు తీసి ఇళ్లల్లో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే అవి అసలు పని చేయవు.
అందుకు కారణం రైళ్లలో అమర్చిన ఫ్యాన్లు 110 డీసీలో పని చేస్తాయి. ఇక అటువంటి ఫ్యాన్లు మన ఇళ్ళల్లో ఉండే కరెంట్ తో నడపడం అసాధ్యం .నిజానికి ఇళ్లలో రెండు రకాల విద్యుత్ ను ఉపయోగిస్తాం మొదటిది డీసీ.. రెండవది ఏసీ. ఇంట్లో ఉన్న డీసీ కరెంట్ యొక్క గరిష్ట శక్తి 5, 12 లేదా 24గా ఉంటే ఏసీ యొక్క గరిష్ట శక్తి 220 ఓల్ట్ లుగా ఉంటుంది.

ఇంట్లో ఉండే ఈ విద్యుత్ శక్తి రైళ్లలో వుండే ఫ్యాన్ లను అస్సలు నడప లేవు. కాబట్టి రైళ్లలో ఫ్యాన్ లను దొంగతనం చేయాలని ఎవరూ ఆలోచించరు. వాటిని దొంగతనం చేస్తే వారి సమయం వృధా తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా పట్టుబడితే రైల్వే చట్టాల ప్రకారం కఠిన శిక్షలు కూడా పడతాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications