సూపర్ స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం

సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎప్పటికీ గుర్తుండిపోయే బహుబతినిచ్చారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేయించారు. స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. RA12H33M29S నక్షత్రానికి మహేష్ బాబు పేరు పెట్టారు. గెలాక్సీలో అందరూ అత్యంత ప్రేమగా ఇష్టపడే నక్షత్రం ఇదేనని చెప్పారు.

మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన స్కాట్ లాండ్ టూరుకు వెళ్లారు. సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎపపుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చిరంజీవి, ఎన్టీఆర్, హరీష్ శంకర్, తమన్, విజయ్ దేవరకొండ తదితరులు పోస్టులు పెట్టారు.

fans name star prince maheshbabu

ప్రస్తుతం ప్రిన్స్ గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. బ్రో సినిమాకు త్రివిక్రమ్ పనిచేయడంవల్ల గుంటూరు కారం షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ సమయంలో సినిమాను చిత్రీకరించడానికి ఇతర నటుల కాల్షీట్లు అందుబాటులో లేవు. సాధ్యమైనంత వేగంగా గుంటూరు కారం సినిమాను పూర్తిచేసి 2024 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.

గుంటూరు కారం షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో మహేష్ బాబు నటించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రెండు భాగాలుగా చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+