దేవుడు: చంద్రబాబుకు పూజ చేసి, కొబ్బరికాయ కొట్టారు
అనంతపురం: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అయితే ఏకంగా చంద్రబాబు ఫోటోలకు పూజలు చేశారు. రైతులకు లక్షన్నర వరకు, డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో పలువురు మహిళలు పొలంలో చంద్రబాబు, ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. రైతులు కూడా చంద్రబాబు ఫోటోకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న తమకు రుణాలు మాఫీ చేసిన చంద్రబాబు దేవుడు అన్నారు.

మరోవైపు, చంద్రబాబుకు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల రుణమాఫీలను చేస్తున్నందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు ఇవాళ చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ... ఎన్నికల ముందు, తర్వాత కూడా రైతు రుణమాఫీ చేయడం అసాధ్యమని జగన్ విమర్శలు చేశారన్నారు. రైతు వ్యతిరేకి జగన్ అంటూ రైతులు సీఎం క్యాంపు ఆఫీసు బయట నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications