Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affaira: అమ్మానాన్న అండమాన్ లో, భర్త విదేశాల్లో, ఫుల్ జోష్ లో భార్య రొమాన్స్, ఫినిష్ !

విజయవాడ/ తిరుపతి: మేనమామ కూతురిని ఇంట్లో పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఆ యువకుడు ఓకే చెప్పాడు. మేనమామ కూతురిని వివాహం చేసుకున్న యువకుడు ఓ కుమారుడికి తండ్రి అయ్యాడు. ఉద్యోగం కోసం భర్త గల్ఫ్ కు వెళ్లాడు. అమ్మాయి అమ్మానాన్న అండమాన్ లో ఉన్నారు. అత్తారింటిలో ఉంటున్న మహిళ అదే ప్రాంతంలో ఉంటున్న పరాయి వ్యక్తి మోజులో పడి అతనితో ఎంజాయ్ చేసింది. కోడలి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న మామ ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు.

గల్ఫ్ లో ఉన్న కొడుక్కి అతని భార్య అక్రమ సంబంధం విషయం చెప్పాడు. ఇదే సమయంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో చెక్కేసింది. 10 రోజుల తరువాత ఆమెను పట్టుకుని వచ్చిన పోలీసులు పంచాయితీలు చేశారు.అండమాన్ లో ఉన్న అమ్మ కూడా వచ్చి కూతురి పంచాయితీలో భాగం అయ్యింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మామ తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకుని మా కుటుంబం పరువు తీసిందని ఆమెను దారుణంగా చంపేశాడు. కూతురి కోసం అడ్డుపడిన అండమాన్ అమ్మకు కూడా కత్తిపోట్లు పడ్డాయి.

 రక్తసంబంధం

రక్తసంబంధం

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పూ గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం, మేడిచర్లపాలెంలో సత్యనారాయణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. సత్యానారాయణ భార్య సోదరుడికి ప్రియమణి (25) అనే కుమార్తె ఉంది. సత్యానారాయణకు విజయ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. విజయ్ కుమార్ కు, ప్రియమణితో వివాహం చెయ్యాలని ముందుగానే ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 మేనమామ కూతురితో పెళ్లి

మేనమామ కూతురితో పెళ్లి

మేనమామ కూతురు ప్రియమణిని వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో విజయ్ కుమార్ ఓకే చెప్పాడు. 7 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్, ప్రియమణిల వివాహం జరిగింది. భర్త విజయ్ కుమార్ తో చక్కగా కాపురం చేసిన ప్రియమణి ఓ కొడుక్కి తల్లి అయ్యింది. భార్య ప్రియమణితో చక్కగా కాపురం చేస్తున్న విజయ్ కుమార్ కొడుకుతో కలిసి సంతోషంగా ఉండేవాడు.

 అమ్మానాన్న అండమాన్...... గల్ఫ్ లో భర్త

అమ్మానాన్న అండమాన్...... గల్ఫ్ లో భర్త

ప్రియమణి అమ్మ మంజుల, ఆమె భర్త ప్రస్తుతం అండమాన్ లో ఉంటున్నారు. ప్రియమణి భర్త ఉద్యోగం కోసం గల్ఫ్ లోని ఖతార్ కు వెళ్లాడు. ప్రియమణి ఆమె మామ సత్యానారాయణ ఇంటిలో ఉంటున్నదని. కతార్ లో ఉంటున్న భర్త విజయ్ కుమార్ డబ్బులు సంపాధించి పంపిచండంతో అతని భార్య ప్రియమణి ఖతర్నాక్ గా తయారైయ్యింది.

 భార్య అక్రమ సంబంధం

భార్య అక్రమ సంబంధం

భర్త విజయ్ కుమార్ విదేశాల్లో ఉండటం, తల్లిదండ్రులు అండమాన్ లో ఉండటంతో ప్రియమణి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. అడిగే దిక్కు లేకపోవడంతో ప్రియమణి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడంతో ఆ విషయం ఆమె మామ సత్యానారాయణకు తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని కోడలు ప్రియమణికి ఆమె మామ సత్యానారాయణ బుద్దిమాటలు చెప్పాడు.

 ప్రియుడితో ఎస్కేప్

ప్రియుడితో ఎస్కేప్

గల్ఫ్ లో ఉన్న కొడుకు విజయ్ కుమార్ కు అతని భార్య ప్రియమణి గురించి సత్యనారాయణ విషయం మొత్తం చెప్పాడు. విదేశాల్లో ఉన్న భర్త విజయ్ కుమార్ అతని భార్య ప్రియమణికి ఫోన్ లోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. విదేశాల్లో ఉన్న మొగుడు అవసరం లేదని డిసైడ్ అయిన ప్రియమణి ఆమె ప్రియుడితో కలిసి గత నెల 22వ తేదీన ఇంటి నుంచి పారిపోయి ఎంజాయ్ చేసింది.

 పోలీసుల పంచాయితీలు

పోలీసుల పంచాయితీలు

తన కోడలు కనపడటం లేదని సత్యనారాయణ పోలీసు కేసు పెట్టారు. ప్రియమణి కోసం గాలించిన పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని పిలుచుకుని వచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రియమణిని సత్యానారాయణ కుటుంబ సభ్యులకు అప్పగించారు. నీ కూతురు ప్రియమణి వేరే వ్యక్తితో లేచిపోయిందని సత్యానారాయణ అండమాన్ లో ఉన్న ఆమె తల్లి మంజులకు సమాచారం ఇచ్చాడు.

 కోడలిని పొడిచి చంపిన మామ.... తల్లికి కత్తిపోట్లు

కోడలిని పొడిచి చంపిన మామ.... తల్లికి కత్తిపోట్లు

అండమాన్ నుంచి బయలుదేరిన ప్రియమణి తల్లి మంజుల మేడిచర్లపాలెం చేరుకుంది. సత్యానారాయణ ఇంట్లో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కోడలు ప్రియమణి అతనితో పారిపోయి మా ఇంటి పరువు తీసిందని ఆవేశంతో రగిలిపోయిన సత్యనారాయణ కత్తి తీసుకుని కోడలు ప్రియమణి మీద దాడి చేశాడు. కూతురు ప్రియమణి కోసం అడ్డుపడిన ఆమె తల్లి మంజులకు కత్తిపోట్లు పడ్డాయి. తీవ్రగాయాలైన ప్రియమణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Recommended Video

    Pv Sindhu ఘనత, ప్రముఖల రియాక్షన్.. తండ్రి ఎమోషనల్ | Tokyo Olympics || Oneindia Telugu
     కోడలిని చంపి లొంగిపోయిన మామ

    కోడలిని చంపి లొంగిపోయిన మామ

    కోడలు ప్రియమణిని హత్య చేసిన సత్యనారాయణ నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. మా కుటుంబం పరువు తీసిన తన కోడలు ప్రియమణిని తానే హత్య చేశానని సత్యనారాయణ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. భర్త విజయ్ కుమార్ విదేశాల్లో ఉండటంతోనే పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియమణి హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనింది.

    తల్లి హత్యకు గురి కావడం, తాత జైలుకు వెళ్లడం, ప్రియమణి అమ్మమ్మ మంజుల ఆసుపత్రిపాలు కావడంతో ప్రియమణి కొడుకు రోడ్డున పడ్డాడు. ప్రియమణి హత్యకు గురి కావడంతో ఆమె ప్రియుడు పారిపోయాడు. పోలీస్ స్టేషన్ లో ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చినా ప్రియమణిని రెచ్చగొట్టి ఆమె హత్యకు కారణం అయాడని పోలీసులు అంటున్నారు. ఇంత రామాయణం జరగడానికి కారణం అయిన ప్రియమణి ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+