సంక్రాంతికి ఇంటికొచ్చిన కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం.. పదేపదే రేప్ చేయడంతో భరించలేక..
హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు సెలవులొస్తే ఎగిరిగంతేస్తారు. కానీ ఈ పాపకు మాత్రం ఇంటికెళ్లాలంటేనే భయం. అలాగని ఒంటరిగా హాస్టల్ లో గడిపే వీలు కూడా లేదు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నా అనేవాళ్లెవరూ తనను దగ్గరికి తీసుకోరు.. గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రతిసారి బాధతోనే కదిలేది. ప్రస్తుత సంక్రాంతి సెలవులకు కూడా అలానే ఇంటికొచ్చింది. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కీచకుడయ్యాడు.

రెండేళ్లుగా దారుణం..
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన కీచక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయవరం పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లి మరణించడంతో హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల కిందట ఇలాగే సెలవుల టైమ్ లోనే ఆ చిన్నారిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా పశువాంఛ తీర్చుకుంటూ నరకం చూపించేవాడు.

వద్దన్నా వినకుండా..
సంక్రాంతి సెలవుల కోసం ఇంటికొచ్చిన కూతురిపై కీచక తండ్రి యధావిధిగా అఘాయిత్యానికి సిద్ధమయ్యాడు. ఆదివారం రాత్రి బాగా తాగొచ్చి కూతురిపై మరోసారి నీచానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి మళ్లీ అత్యాచారానికి యత్నించడంతో ఆ పాప భరించలేకపోయింది. తండ్రి నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. విషయం తెల్సుకున్న చుట్టుపక్కలవాళ్లు పాపను కాపాడి 100కు డయల్ చేశారు.

పోక్సో, దిశ చట్టాల కింద..
ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు.. ప్రాధమిక విచారణ తర్వాత కీచక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. వాడిపై పోక్సో, దిశ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని రాయవరం పోలీసులు తెలిపారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి తొందరగా శిక్షలు పడాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రమంతటా రేప్ కేసులు నమోదవుతూనేఉన్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications