కడపలో రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప:కడప జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటన లో ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ సహ మరో నలుగురు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Five killed in road accident in Kadapa district

వేంపల్లి నుంచి కడపవైపు కారు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ ‌(14), గిరి (15), భాస్కర్‌ (26) గా గుర్తించారు.

ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five people were killed in road accident at Kadapa district on Monday.Laxmi Narasimha, Karthik, giri, bhaskar and car driver were died in this accident.police registered a case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి