కాకినాడలో దారుణం .. ఐదేళ్ళ బాలికపై రేప్ .. రక్తపు మడుగులో చిన్నారి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన జరిగింది. అభం శుభం తెలియని చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా ఆవేదనకు గురి చేసింది. ఐదేళ్ళ చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కాకినాడ లోని గోలీల పేట శివారులో బాలిక రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పాపను కాకినాడ జిజిహెచ్ కు తరలించారు.
ఇంట్లో నిద్రిస్తున్న బాలికను అపహరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గా తెలుస్తుంది. మంచంపై నిద్రపోతున్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా తీసుకొని వెళ్ళిన అగంతకులు ఊరి చివర దేవాలయం వద్ద బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు లేచి చూసేసరికి బాలిక కనిపించలేదు. బాలికను వెతుకుతున్న క్రమంలో బాలిక ఊరి చివర ఆలయం వద్ద ఉన్నట్లుగా తెలిసింది. స్థానికులు బాలికను చూసే సమయానికి ఆమె ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు. బాలిక రక్తపుమడుగులో పడి ఉంది.

బాలిక శరీరంపై గాయాలు కనిపించాయి. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పోలీసులకు సమాచారం అందించని కారణంగా వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానికులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వన్ టౌన్ సిఐ చొరవతో వైద్య చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదు చేసి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారెవరన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications