హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేరాలు, పోలీసులమంటూ..: మహేందర్ రెడ్డి (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌ను స్మార్ట్‌ సిటీగా చేయాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖఱ రావు సూచనలకు అనుగుణగా పనిచేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఈ సంవత్సరం నేరాలు పెరిగాయని తెలిపారు.

ముఖ్యంగా తాము పోలీసులమంటూ మోసాలకు పాల్పడిన కేసులు అధికంగా ఉన్నాయన్నారు. చోరీలు, దాడులు, కిడ్నాప్‌లు, రేప్‌ కేసులు పెరిగాయని సీపీ పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా నగరంలో మహిళలపై దాడులు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది రాజధాని పరిధిలో 40 శాతం సైబర్‌ నేరాలు నమోదు కాగా, 10 శాతం చోరీలు, 5 శాతం అత్యాచారాల కేసులు, 40 శాతం సైబర్‌ నేరాలు నమోదయ్యాయన్నారు.

రూ. 46 కోట్లు సొమ్ము చోరీకి గురి కాగా, రూ. 26 కోట్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. నగరంలో నేరాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నేరాలను కట్టడి చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని సీపీ వెల్లడిచారు.

మహిళల రక్షణకు చర్యలు

మహిళల రక్షణకు చర్యలు

తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నందున్న మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్‌ రెడ్డి చెప్పారు.

గస్తీకి పకడ్బందీ చర్యలు

గస్తీకి పకడ్బందీ చర్యలు

హైదరాబాద్ నగరంలో నూతనంగా ప్రవేశపెట్టిన పెట్రోలింగ్‌ కార్లకు జీపీఎస్‌, జీపీఆర్‌ఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ వ్యవస్థను కమాండింగ్‌ కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

ఫేస్‌బుక్, గ్రూప్ మెసేజ్‌లు

ఫేస్‌బుక్, గ్రూప్ మెసేజ్‌లు

నగరంలో ఫ్రెండ్లీ పోలింగ్‌ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని సీపీ చెప్పారు. ఇందులో భాగంగా పేస్‌ బుక్‌, గ్రూప్‌ మెసేజ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఝానం

ఆధునిక సాంకేతిక పరిజ్ఝానం

నేరాలను అదుపు చేయడానికి తాము ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని వాడుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

పోలీసులమంటూ..

పోలీసులమంటూ..

పోలీసులమని చెప్పి నేరాలకు పాల్పడిన కేసులు ఈ ఏడాది ఎక్కువగా నమోదైనట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

మహిళలపై నేరాలు తగ్గాయి..

మహిళలపై నేరాలు తగ్గాయి..

మహిళలపై నేరాల సంఖ్య తగ్గిందని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి చెప్పారు. 2,564 టాస్క్‌ఫోర్స్ కేసులు ఛేదించామని తెలిపారు. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేశామని చెప్పారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్

ఫ్రెండ్లీ పోలీసింగ్

హైదరాబాద్ నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

ట్రాఫిక్ చలాన్ల ద్వారా..

ట్రాఫిక్ చలాన్ల ద్వారా..

ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.34 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.

English summary
Hyderabad police commissioner M mahender Reddy said that crime rate increased this year compared to last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X