జగన్‌తో పొంగులేటి భేటీ- హామీ: జూపల్లి కృష్ణారావుతో కలిసి త్వరలో..!!

అమరావతి: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారత్ రాష్ట్ర సమితికి దూరం అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తోన్నారంటూ ఫిర్యాదులు అందడంతో వారిద్దరిపైనా వేటు వేసింది బీఆర్ఎస్.

ఈ ఇద్దరు నాయకులు ఏ పార్టీలో చేరబోతోన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరుతానంటూ ఇటీవలే పొంగులేటి ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఏపీకి వచ్చారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు.

జూపల్లి కృష్ణారావుతో కలిసి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నట్లు ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలియజేసినట్లు చెబుతున్నారు. ఏదైనా జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జిల్లా సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారని అంటున్నారు.

jaganponguleti

ఏ పార్టీలో ఉన్నా సంతోషంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండాలంటూ జగన్ ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.నిజానికి- వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తోన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేశారు.

అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీలో చేరొచ్చనే ప్రచారం మొదట్లో జోరుగా సాగినప్పటికీ- జాతీయ పార్టీ వైపు పొంగులేటి మొగ్గు చూపడం వల్ల అది సాధ్యపడలేదని సమాచారం.

కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటి. అందుకే ఆయన ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే కాంగ్రెస్‌కు కొంత బలం సమకూరినట్టే అవుతుంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు- ఇప్పటికే బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్‌లో చేరడమంటూ జరిగితే వాటి తీవ్రతను మరింత పెంచుతారనడంలో సందేహాలు అక్కర్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+