జగన్ తో అనిల్ కుంబ్లే భేటీ-స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాయం ఆఫర్
భారత మాజీ స్పిన్నర్, క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఇవాళ ఏపీకి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన సీఎం జగన్ తో చర్చించారు. ముఖ్యంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.
ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన క్యాంపు కార్యాలయంలో అనిల్ కుంబ్లే భేటీ అయ్యారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు.

ముఖ్యంగా ఏపీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు తన సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం జగన్ కు తెలిపారు. దీంతో పాటు క్రీడా పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా ప్రయత్నించాలని సీఎం జగన్ కు ఆయన సలహా ఇచ్చారు.

ఏపీలో క్రీడా పరికరాల తయారీ అంశంపై సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ నుంచి మాత్రమే క్రీడా పరికరాలు తెచ్చుకుంటున్నామని, ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చి క్రీడాపరికరాల తయారీ యూనిట్ పెట్టిస్తే దక్షిణాదిలో క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని అనిల్ కుంబ్లే సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని జగన్ కుంబ్లేకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే చెప్పారు.
జగన్ తో అనిల్ కుంబ్లే భేటీ-స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాయం ఆఫర్#AndhraPradesh #amaravati #ysjagan #anilkumble pic.twitter.com/YwIrVON2cj
— oneindiatelugu (@oneindiatelugu) July 5, 2021












Click it and Unblock the Notifications