కోటంరెడ్డి విషయంలో సీఎం జగన్ చేసిన పొరపాటు అదే : పేర్ని నాని..!!

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం పైన మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం పైన ఆయన స్పందించారు. కోటంరెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. దీని పైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. శ్రీధర్ రెడ్డి తాను మాట్లాడినట్లుగా చెబుతున్న తన స్నేహితుడుతో సహా విచారణ చేస్తున్నట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరూ రూరల్ వైసీపీ ఇంఛార్జ్ గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఈ పరిణామల పైన మాజీ మంత్రి పేర్ని స్పందించారు.

కోటంరెడ్డి చేసిన నమ్మక ద్రోహమని పేర్ని నాని మండిపడ్డారు. జగన్ ఆయన్ను నమ్మి టికెట్ ఇస్తే ఈ విధంగా చేయటం సరి కాదన్నారు. ఎన్నికల వేళ పక్షలు వసల వెళ్లే కాలం అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన విచారణ చేయమని.. వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని తాము కూడా కోరుతున్నామని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతున్నారని..కోటంరెడ్డి తన భక్తుడనే మత్తులో జగన్ ఉన్నారని ..అదే ఆయన చేసిన పొరపాటనే విధంగా పేర్ని నాని చెప్పుకొచ్చారు. కోటంరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కోటంరెడ్డి నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసారని భయపడాల్సిన అవసరం ఏంటన్నారు. కోటంరెడ్డి చంద్రబాబు - లోకేష్ తో టచ్ లో ఉండటం సరైనదేనా అని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం పైన చేసిన వ్యాఖ్యలను ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామని చెప్పారు.

Former Minister Perni Nani interesting comments over Kotamreddy Episodem and CM Jagan Decision

కోటంరెడ్డి చెబుతున్నట్లుగా నిజంగా ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఉంటే లోకేష్ తో టచ్ లో ఉన్న విషయం ఎప్పుడో తెలిసేది కదా అని నాని ప్రశ్నించారు. లోకేశ్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అక్కడి నుంచి చెప్పిన విధంగా నడుచుకున్నారని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 25న బెంజ్ కారులో కోటంరెడ్డి హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలిసారని సమాచారం ఉందన్నారు. కోటంరెడ్డి తనకు ఆరోగ్య బాగోలేకపోతే చంద్రబాబు..లోకేష్ ఫోన్ చేసారని చెబుతున్నారని...తనకు ఆరోగ్యం బాగోలోకపోతే ఎందుకు ఫోన్ చేయలేదని నిలదీసారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఏం చెబితే అది చేయ‌డానికి నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నార‌ని ఫైర్ అయ్యారు. మంత్రి పదవులు రాలేదని ఈ విధంగా వ్యవహరించటం సరి కాదన్నారు. జిల్లాలో ఇంకా సీనియర్లు ఉన్నారని.. పదవుల గురించి చూసుకుంటే రాజకీయ అవసరాలు అవుతాయి కానీ అభిమానం అవ్వదని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కోటంరెడ్డి ఎవరి ట్రాప్ లోనే పడ్డారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+