ఎన్నికల వేళ టీడీపీకి సీనియర్ నేత రాజీనామా- వైసీపీలో చేరిక, కీలక పదవి..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారింది. నామినేషన్ల విత్ డ్రా సమయం ముగస్తుండగా.. ఏకగ్రీవాల పై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ పైన సుప్రీం మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సూచించింది. భద్రత పైనా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో సేవలు అందిస్తున్న నేత.. వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా చేసారు. 40 ఏళ్లుగా టీడీపీలో పనిచేసి పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని గుండ లక్ష్మీదేవి ఆవేదన చెందారు. పార్టీలో అవమానాలు భరించలేకపోతున్నామని కన్నీటి పర్యంతం అయ్యారు. గుండ లక్ష్మీదేవి అనుచరులతో కలిసి గురువారం (అక్టోబర్ 22న) జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. 40 ఏళ్లుగా తాను, తన భర్త టీడీపీలో పనిచేశామని.. ఇప్పుడు పార్టీని వీడటం బాధగా ఉందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కొన్నేళ్లుగా పార్టీలో తమను, తమ అనుచరుల్ని ఇబ్బంది పెట్టారని.. తన భర్త విగ్రహం కోసం పెట్టిన దిమ్మెల్ని కూల్చేశారని చెప్పుకొచ్చారు. వరుసగా ఎదురవుతున్న అవమానాలు భరించలేక టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

శ్రీకాకుళంలో మారుతున్న సమీకరణాలు
నాడు ఎన్టీఆర్ పిలుపు మేరకు తన భర్త గుండ అప్పల సూర్యనారాయణ టీడీపీలో చేరారని గుర్తు చేసారు. తన భర్త నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశారని.. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేశామని.. 2024లో తనకు సీటు ఇవ్వకపోయినా సరే తమ కుటుంబం టీడీపీని నమ్ముకొని.. పార్టీ కోసం నిబద్దతో పని చేసామని చెప్పుకొచ్చారు. తన భర్త పదేళ్లుగా మనస్తాపంతో ఉన్నారని.. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తన భర్త చనిపోయిన తర్వాత తమ కుటుంబాన్ని, అనుచరుల్ని అవమానించారు, ఇబ్బందిపెట్టారని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. గుండ లక్ష్మీదేవి అనుచరులతో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. శ్రీకాకుళం మేయర్ సీటు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
