టీడీపీలో మరో బిగ్ వికెట్ అవుట్?
TDP Janasena BJP alliance: ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు అత్తర్ చాంద్ భాషా బయటికి వచ్చారు. టీడీపీకి ఆయన గుడ్‌బై చెప్పారు. రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి పంపించారు.

సత్యసాయి పుట్టపర్తి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అత్తర్ చాంద్ భాషాకు టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చాంద్ భాషా.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కదిరి నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. టీడీపీ కండువా కప్పుకొన్నారు.
2019 ఎన్నికల సమయంలోనే ఆయనను పక్కనపెట్టారు చంద్రబాబు. టికెట్ ఇవ్వలేదు. కందికుంట వెంకటప్రసాద్‌నే బరిలో దింపారు అప్పట్లో. ఈ సారి కూడా కదిరి టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందికుంటకే ఇచ్చారు. దీనితో టీడీపీని వీడారు చాంద్ భాషా. ఈ సాయంత్రం కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు.
అదే సమయంలో అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కూడా అదే బాట పట్టారు. టీడీపీకి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజంపేటలో తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో రాజంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు బత్యాల. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్సీపీకి చెందిన మేడా మల్లికార్జునరెడ్డి చేతిలో 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. రాజంపేట అసెంబ్లీ టికెట్‌ను సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు చంద్రబాబు.
దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన బత్యాల చెంగల్రాయుడు.. తన అనుచరులతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు. టీడీపీలో కొనసాగడం వృధా అంటూ ఆయన అనుచరులు మూకుమ్మడిగా తేల్చశారని, వారి కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications