Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కోరితే సీటు త్యాగం చేస్తా, దగ్గరుండి గెలిపిస్తా- చింతమనేని ప్రభాకర్ ఆఫర్.. !

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా విపక్ష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఇంకా ఖరారు కాలేదు. దీంతో ఆయన గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనే తిరిగి పోటీ చేస్తారా లేక మరో కొత్త నియోజకవర్గంలో పోటీ చేస్తారా అన్నది తేలలేదు. అదే సమయంలో తిరుపతి, పిఠాపురం, కాకినాడ వంటి పలు కొత్త నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని సైతం ఇరుకునపెట్టిన చింతమనేని, మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో పోటీ చేస్తానంటే వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.

former tdp firebrand mla chintamanei offers his assembly seat to pawan kalyan

పవన్ దెందులూరు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని తాజాగా చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. అంతే కాదు పవన్ ను భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చారు. జనసేన అధినేత దెందులూరు కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు సొంత పార్టీతో పాటు జనసేనలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.

అయితే ఈ విషయంలో చింతమనేని ప్రభాకర్ మరో మెలిక కూడా పెట్టారు. దెందులూరులో పవన్ కళ్యాణ్ కోసం తాను సీటు త్యాగం చేసే విషయంలో తమ నాయకుడు చంద్రబాబు తీసుకునేదే ఫైనల్ నిర్ణయం అన్నారు. దెందులూరు సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని తెలిపారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు చేశారా లేక మరేదైనా ఉద్దేశంతో చేశారా అన్న చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+