కాంగ్రెస్‌లోకి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎఐసిసిలో కీలకపదవి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవలే ఆయన జనసేనలో కూడ చేరుతారనే ప్రచారం కూడ సాగింది. ఈ ప్రచారం సాగుతున్న తరుణంలోనే కాంగ్రెస్‌లో చేరుతారనే ఆయన సన్నిహితుల ద్వారా ప్రచారం బయటకు వస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించకుండా అడ్డుకోవాలని చివరి నిమిషం వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలను చేశారు. చివరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైఖ్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు.

జై సమైఖ్యాంద్ర పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. కానీ, రాష్ట్రంలో ఆయన పార్టీ తరపున ఎవరూ కూడ విజయం సాధించలేదు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఆయన క్రీయాశీలక రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొంతకాలంగా ఆయన క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడ సాగుతోంది.

కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ మేరకు ఆయన సన్నిహితులు కూడ ఈ విషయమై సానుకూల సంకేతాలను ఇస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనతో టచ్‌లో ఉందంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వచ్చే నెలలో కిరణ్ ప్రకటన

వచ్చే నెలలో కిరణ్ ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో తిరిగే చేరే విషయమై వచ్చే నెలలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడ ఉంది. అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కిరణ్ కూడ సుముఖంగానే ఉన్నారనే సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో విబేధించినట్టుగా కిరణ్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో తనకు విబేధాలు లేవనే అభిప్రాయాన్ని కిరణ్ వ్యక్తం చేస్తోన్నట్టు సాగుతోంది.

ఎఐసిసిలో కీలక పదవి

ఎఐసిసిలో కీలక పదవి

కాంగ్రెస్ పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరగానే ఆయనకు ఎఐసిసిలో కీలకపదవిని కట్టబెట్టేందుకు పార్టీ నాయకత్వం హమీ ఇచ్చిందనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై కిరణ్ నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ఆయన ఇంకా అధికారికంగా ఎక్కడ కూడ స్పందించలేదు. అయితే ఏదో ఒక పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరితేనే ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయంతో ఉన్నాడనే ప్రచారం కూడ ఉంది.

వెంకయ్య వల్లే బిజెపిలోకి వెళ్ళలేదా?

వెంకయ్య వల్లే బిజెపిలోకి వెళ్ళలేదా?

2014 ఎన్నికలు పూర్తైన తర్వాత కొంత కాలానికి కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంకయ్యనాయుడు కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరడాన్ని అడ్డుకొన్నారనే ప్రచారం కూడ ఉంది.దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+