ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇలా చేయండి!

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దీపావళికి ధమాకా ఆఫర్ ప్రకటించింది. దీపం 2.0 పథకం ద్వారా మహిళలకు శుభవార్త చెప్పింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టి పంపిణీ చేయనున్నారు.

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ ల పథకం
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సిలిండర్లను అందించేలా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో ఉత్సాహం కనిపిస్తుంది. ప్రజలు ఈ పథకానికి ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనేది తెలుసుకుని ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

free gas cylinders scheme deepam 2 0 toll free numbers and special counters to resolve the problems

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో నగదు బదిలీ ఇలా
ఇక ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ప్రస్తుతం ఏ విధంగా అయితే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని, గ్యాస్ తీసుకుంటున్నారో అదేవిధంగా నగదు చెల్లించి గ్యాస్ తీసుకోవలసి ఉంటుంది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోపు సిలిండర్ తాలూకా డబ్బులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో లబ్ధిదారుని వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది ప్రభుత్వం.

ఉచిత గ్యాస్ పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
దీనికోసం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్ తీసుకొని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. ఆ తర్వాత 24గంటల నుండి 48గంటల వ్యవధిలో ఇది అప్డేట్ అవుతుంది. దీని తర్వాత మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. ఇందులో ఏదైనా ఇబ్బందులు ఉంటే బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది.

ప్రత్యేక కాల్ సెంటర్ లు, టోల్ ఫ్రీ నంబర్లు
జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది .గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే కూడా వారి సమస్యలను అధికారులు పరిష్కరిస్తారు.

రేపటి నుండే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడం కోసం పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు . తొలి విడత గ్యాస్ సిలిండర్ పంపిణీ నవంబర్ ఒకటవ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్ద లబ్ధిదారులు పోటీ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+