Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

మనదేశానికి సంబంధించినంత వరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతోంది. మార్చి 31వ తేదీతో మనం పూర్తిచేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఇలాంటి ఆర్థిక మార్పులు చాలావున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

* పాన్-ఆధార్ కార్డు లింక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఆదేశాల ప్రకారం మార్చి 31వ తేదీనాటికి పాన్-ఆధార్ లింక్ చేయాలి. ఈ రెండు లింక్ చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఈసారి యాక్టివేట్ చేయించుకునేటప్పుడు రూ.10వేల జరిమానా చెల్లించాలి.

* కార్ల ధరల పెంపు స్టేజ్-2 అమలుతో కార్ల ధరలు పెరగబోతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, టయోటా, ఆడి, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీలకు చెందిన వాహనాల ధర పెరగనుంది. ఈ కంపెనీలన్నీ తమ కొత్త ధరను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. కారు మోడల్ ను బట్టి ఒక్కో కంపెనీ రూ.50వేల వరకు పెంచుతోంది.

from april 1st new financial rules implement the indian government

* మన దేశంలో బంగారం అమ్మకానికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 6 అంకెల HUID నెంబర్ రిజిస్టర్ చేసిన ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కొత్త బంగారం కొనుగోలు చేయాలంటే హాల్ మార్క్ కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రజలు తమ పాత ఆభరణాలను హాల్ మార్క్ లేకుండా విక్రయించుకోవచ్చు.

* రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం పాలసీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది వర్తిస్తుంది. పాలసీ ద్వారా వచ్చే ఆదాయంపై ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

* ఏప్రిల్ 1వ తేదీ నుంచి డీమ్యాట్ ఖాతాదారులు నామినీ పేరు దాఖలు చేయాల్సి ఉంటుంది. అది చేయకపోతే ఖాతా నిలిచిపోతుంది. సెబీ సర్క్యులర్ ప్రకారం.. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో నామినీని కచ్చితంగా యాడ్ చేయాలి.

* మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ నామినేషన్‌ను మార్చి 31లోపు పూర్తి చేయాలి. ఆలోగా పూర్తిచేయలేకపోతే ఏప్రిల్ 1వ నుంచి సంబంధిత పోర్ట్‌ఫోలియో స్తంభింపజేయనుంది. వివరాలను పూర్తిగా సమర్పించిన తర్వాత మాత్రమే అది మళ్లీ ప్రారంభమవుతుంది.

* ఏప్రిల్ నెలలో వివిధ పండుగలు, ఇతర కారణాలవల్ల దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+