నిమజ్జనానికి ఇలా బహురూపుల గణేశులు (పిక్చర్స్)
హైదరాబాద్: తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు సాగరంలో నిమజ్జనం అయ్యాడు. ఇంటి వద్ద, అపార్టుమెంట్లలో, కార్యాలయాల్లో పూజలు అందుకున్న గణనాథులతో పాటు బాలాపూర్, ఖైరతాబాద్ తదితర భారీ ఏకదంతుల నిమజ్జనం పూర్తయింది.
బాలాపూర్ గణేషుడు బుధవారం నిమజ్జనం కాగా ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర బుధవారం అర్ధరాత్రి రెండు గంటలకు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జనం పూర్తయింది. ఇంకా చాలా వినాయకులు నిమజ్జనం కోసం ఉన్నాయి. గురువారం సాయంత్రం వరకు కొనసాగనుంది.
కాగా, వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలు ఆకట్టుకున్నాయి. వీర హనుమాన్, గబ్బర్ సింగ్, అన్నాహజారే, కృష్ణుడు... ఇలా తదితర రూపాల్లో ఆకట్టుకున్నాయి. వాటిని తీసుకు వచ్చిన వాహనాల అలంకరణ అద్భుతంగా ఉంది.

సాగర తీరానికి చేరుకుంటున్న గణేషులు
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) తీరానికి నిమజ్జనం కోసం తరలి వెళ్తున్న గణనాథులు. వివిధ రూపాల్లో గణనాథ ప్రతిమలు భక్తులను ఆకట్టుకున్నాయి.

చేతిలో
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేసేందుకు గణేషుడి ప్రతిమను తన చేతి పట్టుకొని తీసుకు వస్తున్న ఓ నగర భక్తుడు.

నిమజ్జనం
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో ఓ లంబోదరుడి ప్రతిమను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం. నిమజ్జన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.

భక్తుల కోలాహలం
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో గణేష్ నిమజ్జనంను చూసేందుకు తరలి వచ్చిన భక్తులు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంకుబండు కోలాహలంగా కనిపించింది.

గణపతి నిమజ్జనం
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో ఓ లంబోదరుడి ప్రతిమను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం. నిమజ్జన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలి వచ్చారు.

చిన్ని గణేషుల క్యూ
చిన్న చిన్న వాహనాలలో చిన్ని గణపతులను పొందుపర్చి వినాయక సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు తీసుకు వస్తున్న దృశ్యం. ఇది అందర్నీ ఆకట్టుకుంది.

బ్రిడ్జ్ పై నుండి
వినాయక సాగర్‌లో నిమజ్జనం కోసం రాత్రిపూట తరలి వెళ్తున్న వినాయక విగ్రహాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి వీక్షిస్తున్న భక్తుల దృశ్యం.

మహా గణపతి
మట్టి విగ్రహాలను పూజించండి పర్యావరణాన్ని రక్షించాలంటూ పర్యవరణ పరిరక్షణ పైన జాగృతం చేస్తున్న మట్టి వినాయక విగ్రహం.

హనుమాన్ వినాయకుడు
వినాయక చవితి వచ్చిందంటే గణనాథుడిని వివిధ రూపాల్లో ప్రతిష్టిస్తుంటారు భక్తులు. సాగర తీరంలో వీర హనుమాన్ రూపంలో గణేషుడు.

బంగారు రంగు
ఓ వైపు వినాయక నిమజ్జన వెలుగులు, మరోవైపు వర్షం కురవడంతో సాగర తీరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్, దాని పరిసరాలు బంగారు వర్ణంలో మెరుస్తున్న దృశ్యం.

గణేషుడి రూపంలో
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గణేషుడి ముఖంతో ఓ వ్యక్తి ఆకట్టుకున్న దృశ్యం. బేగంబజార్‌లో ఇది కనిపించింది.

అలంకరణ
బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాదులోని చార్మినార్ వద్ద అద్భుతంగా అలంకరించబడిన వాహనంలో గణనాథుడు.

నాగరాజ గణపతి
హైదరాబాదులోని చార్మినార్ వద్ద నాగరాజుతో పరమేశ్వరుడి రూపంలో గణనాథుడు. గణేషుడు వివిధ రూపాల్లో భక్తులను అకట్టుకున్నాడు.

శోభాయాత్ర
వినాయక నిమజ్జనం సందర్భంగా సాగర తీరానికి తరలి వెళ్తున్న గణనాథులు. ఒక్కో గణేషుడి ప్రతిమ ఒక్కో రూపంలో భక్తులను ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న వరుస గణనాథులు
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం చిన్న చిన్న వాహనాలు తయారు చేసి వాటిలో వినాయకుడి ప్రతిమలను ఉంచి తీసుకు వెళ్తున్న దృశ్యం. రోడ్డు పక్కన ప్రసాదాల పంపిణీ కోసం టెంట్లు వేశారు.

గణనాథుల క్యూ
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం చిన్న చిన్న వాహనాలు తయారు చేసి వాటిలో వినాయకుడి ప్రతిమలను ఉంచి తీసుకు వెళ్తున్న దృశ్యం.

భలే ఉందిగా
వినాయకుడి నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం చిన్న చిన్న వాహనాలు తయారు చేసి వాటిలో వినాయకుడి ప్రతిమలను ఉంచి తీసుకు వెళ్తున్న దృశ్యం.

శివుడి చేతిలో
గణేషుడి నిమజ్జనం సందర్భంగా గణనాథులు బుధవారం సాగరానికి వెళ్తున్న దృశ్యం. శివుడి చేతిలో నాట్యం చేస్తున్న గణనాథుడు ఆకట్టుకున్నాడు.

బాలాపూర్ గణేషుడు
బుధవారం లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేషుడిని భారీ శోభా యాత్రతో నిమజ్జనానికి తీసుకు వెళ్తున్నదృశ్యం. బాలాపూర్ లడ్డు రూ.9.26 లక్షలు పలికింది.

లడ్డూ
బాలాపూర్ గణేషుడి లడ్డూను టికెఆర్ సంస్థల చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత తీగల కృష్ణా రెడ్డి రూ.9.26 లక్షలు పలికి దక్కించుకున్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications