ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటే

కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా పౌల్ట్రీ కుదేలైంది. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి చాలా మంది సెలబ్రిటీలు , అధికారులు చికెన్ , ఎగ్స్ బాగా తినాలని , ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ చికెన్ తినాలని చెప్పారు. ఇక తాజాగా నగరి ఎమ్మెల్యే ఏపీఐఐ సి చైర్మన్ రోజా సెల్వమణి కూడా చికెన్ , గుడ్లు బాగా తినాలని చెప్తూ చికెన్ తయారు చేస్తున్న వీడియో ను ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు కరోనా నుండి కాపాడుకోవాలంటే చికెన్ , ఎగ్స్ బాగా తినాలని చెప్పారు.

రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ ఫైర్ బ్రాండ్ లే . బండ్ల గణేష్ తెలంగాణ‌లోనే టాప్ మోస్ట్ పౌల్ట్రీ బిజినెస్ మేన్. ఆయ‌న మూవీస్ నిర్మించ‌డానికి కూడా కార‌ణం కూడా త‌న పౌల్ట్రీ పరిశ్ర‌మే అని చాలా సార్లు చెప్పుకున్నారు. అందుకే రోజా చికెన్ తినమని చెప్పిన వీడియోకు ఆయన స్పందించారు . సినీ న‌టి, వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో చూసిన బండ్ల గణేష్ ఆ వీడియో ను రీ ట్వీట్ చేసి ఎమ్మెల్యే రోజాకు థాంక్స్ చెప్పారు. నిర్మాత క‌మ్ క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేశ్ తాజాగా రోజాపై ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Ganesh tweeted on the video made by MLA Roja

అయితే ఇటీవ‌లి కాలంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా చికెన్ ధ‌ర‌లు విప‌రీతంగా తగ్గటం చికెన్ కి, క‌రోనాకు సంబంధం ఉందని భయపడటం తెలిసిందే . ఇక తాజాగా చికెన్ తో కరోనా రాదని ఎంత‌మంది నిపుణులు చెప్పటంతో పాటు, సెలబ్రిటీలు చెప్తుండటం , కరోనా ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ దీనితో వస్తుందని చెప్పటంతో ప్రజలు మళ్ళీ చికెన్ పై దృష్టి పెడుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ఎమ్మెల్యే రోజా త‌న కుటుంబ స‌భ్యుల కోసం చికెన్ వండుతూ వీడియో చేసి ఇమ్యూనిటి పెర‌గాలంటే గుడ్లు, చికెన్ ఎంతో అవ‌స‌రం అని..అంద‌రూ వాటిని తినాల‌ని ఆమె ప్రోత్సహించటం నచ్చిన బండ్ల గణేష్ థాంక్స్ అంటూ రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+