తప్పుగా అనుకోకండి సార్.. చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ
గంగవ్వ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు జీవం పోస్తున్నారు. ఈ కార్యక్రమంద్వారా ఆమె ప్రజలకు సుపరిచితులయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. గంగవ్వ మాటలకు, పాటలకు జనాలు ముగ్ధులవుతుంటారు. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజు ఓ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సినీ రంగానికి చెందినవారిది, రాజకీయ రంగానికి చెందినవారి జాతకాలను చెప్పించారు. ఛానెల్ ప్రతినిధి చంద్రబాబు, లోకేష్ ఫొటోలు చూపించి.. ఈ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు.

దీంతో గంగవ్వ వారి పేర్లు చెప్పి.. జాతకాలను తాను చెప్పలేనంటుంది. ఛానెల్ ప్రతినిధి మళ్లీ ప్రశ్నిచగా.. ''చంద్రబాబుకు గ్రహణం పట్టింది'' అని గంగవ్వ చెబుతుంది. దీంతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఎన్టీవీ వాడి వనిత టీవీలో జాతకం పేరుతో ఆడిన వైకాపా పెయిడ్ ప్రోగ్రాం గుట్టు విప్పిన గంగవ్వ
— Telugu Desam Party (@JaiTDP) May 23, 2023
జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించిన బులుగు మీడియా ఎన్టీవీ.. ఎన్నడూ వివాదాల్లో దూరని గంగవ్వ, తనకు తానుగా ఇలా మాట్లాడే అవకాశం లేదు అని..(1/2) pic.twitter.com/EhWyEULLRx
తాజాగా గంగవ్వ మరోసారి వైరలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల బాధపడుతున్నానని, టీవీ ఛానెల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని, ఆ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు. మాట జారితే క్షమించాలంటూ చంద్రబాబును క్షమాపణలు కోరారు. ఈ వీడియోను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications