వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతబోధకుడి వేషంలో కిడ్నాప్, బాలికపై పలుమార్లు రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కొర్లమండకు చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన అబ్బదాసరి జోజి కిడ్నాప్ చేయడంతో పాటు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అతనిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన అబ్బదాసరి జోజి సంవత్సర కాలంగా కొర్లమండలో నివాసం ఉంటూ మత బోధకుడిగా వ్యవహరిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలిక, ఆమె తల్లిదండ్రులు తరచూ భగవత్ ప్రార్ధనలకు వస్తుండేవారు. ఈ నేపథ్యంలో బాలికపై కన్నేిన జోజి ఆమెకు మాయమాటలు చెప్పి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

Girl kidnapped and raped several times

ఈ నెల 12న బాలికను తనతో పాటు తీసుకువెళ్ళి రాజమండ్రి సమీపంలోని ఒక కుగ్రామంలో ఉంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక తెలిపిన వివరాలను బట్టి తెలిసిందని ఎస్‌ఐ అన్నారు. 14వ తేదీన బాలిక తల్లిదండ్రులు తమ అమ్మాయిని మతబోధకుడు ఎత్తుకెళ్ళినట్లుగా ఫిర్యాదు చేశారన్నారు.

ఇతని ఆచూకి కోసం ప్రత్యేక దళాలను పంపి పట్టుకుని వచ్చి బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్‌ఐ చెప్పారు. తనను జోజి ప్రలోభపెట్టి లోబర్చుకుని, భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆ బాలిక తెలిపింది. జోజిపై నిర్భయ చట్టంతో పాటు పలు కేసులను నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ తెలిపారు.

English summary
A person kidnapped and raped a girl several times in krishna districtof Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X