చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. సంబరాల్లో ఫ్యాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపగా, ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో చిరంజీవి విజయవాడ వెళ్ళనున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్
అక్కడ రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అయితే చిరంజీవితో పాటు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే ఘట్టాన్ని చూసేందుకే
రాజమండ్రి పరిసరాలలో ఈ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో షూటింగుకు ఒకరోజు గ్యాప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్ చరణ్ కూడా పాల్గొబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన విపరీతమైన ప్రేమను చూపించే రామ్ చరణ్ తన బాబాయి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నేరుగా చూడడానికి వస్తున్నట్టు తెలుస్తుంది.
రేపు వేడుకకు హాజరు కానున్న సినీ, రాజకీయ ప్రముఖులు
ఇక రేపు జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే రేపు కేసరపల్లిలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతున్నారు. ఇక రేపటి వేడుక కోసం సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు.
రామ్ చరణ్ ఫాన్స్ సంబరాలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు కాబోతున్న క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ కటౌట్లను ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. రేపు కేసరపల్లిలో మెగా అభిమానుల సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో మరి వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications