75వేలకు బంగారం, 90వేలకు వెండి పరుగులు.. రికార్డు ధరలకు రీజన్స్ ఇవే!!
బంగారం, వెండి ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ప్రస్తుతం సామాన్యులు సాహసించే పరిస్థితి లేదు. బంగారం, వెండి విక్రయాలు చేసే షాపులో వంక చూడడం తప్ప, షాపుల్లో కి వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ధరలతో కనిపిస్తుంది.
కొనలేనంతగా పెరుగుతున్న బంగారం ధరలు
ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి నిన్న రాత్రి 11 గంటల సమయానికి 74 వేల 910 రూపాయల వద్ద స్థిరపడింది. ఓ దశలో బంగారం ధర 76 వేలకు పైబడి పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 68 వేల 600 రూపాయల పైనే ఉంది.

బంగారం బాటలో వెండి కూడా
వెండి ధర కూడా 90 వేలకు చేరువగా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర 85,500 రూపాయల వద్ద నిన్న స్థిరపడగా ఇది కూడా ఒకటే రోజు 87 వేల 100 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 16 శాతంబంగారం ధర పెరిగింది. కేవలం జనవరి నెల నుండి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో బంగారం ధర దాదాపు పదివేల రూపాయల మేర పెరిగింది.
పసిడి పరుగులకు కారణాలు
ఇక ఈ పరిణామాలు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అశనిపాతంగా మారాయి. అసలు ఎందుకు ఇంతగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి పైన పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు భారత్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోళ్లు జరపడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
బంగారం పెరగటానికి యుద్ధ వాతావరణంతో పాటు అనేక పరిస్థితులు
అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా ఏర్పడిన అనిశ్చితి, రష్యా గనుల్లో బంగారం తవ్వకాల్లో ఏర్పడిన ఇబ్బందులు మొదలైన అన్ని పరిస్థితులు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు డబ్బు కంటే బంగారం పైన పెట్టుబడి సురక్షితమైన పెట్టుబడి అని కేంద్ర బ్యాంకులు కూడా భావించడంతో, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
13 టన్నుల బంగారాన్ని ఇటీవల నెలల్లో కొన్న రిజర్వ్ బ్యాంకు
మన రిజర్వు బ్యాంకు కూడా ఇటీవల నెలల్లో 13 టన్నుల మేర బంగారాన్ని కొనుగోలు చేసింది. మొత్తంగా చూస్తే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరి కొంతకాలం బంగారం ధరల దూకుడు కనిపిస్తుందని, ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే పరిస్థితి లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications