కోట్ల విలువైన బంగారు ఊయల.. మెగా ప్రిన్సెస్ కు ముఖేష్ అంబానీ దంపతుల గిఫ్ట్!!
చిరంజీవి ఫ్యామిలీ కి జూన్ నెల సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ సందడి చేస్తుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన ఒక బిడ్డకు జన్మనిచ్చారు . 11 సంవత్సరాల తరువాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సంతోషంతో సంబరాలు జరుపుకుంటుంది.
నేడు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు మెగా ప్రిన్సెస్ కు పేరు పెట్టడం తో పాటుగా బారసాల ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. దీంతో చిరంజీవి ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కూతురు పుట్టడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. అలాగే ప్రముఖులు సైతం ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం తోపాటుగా, తమ ప్రేమను వ్యక్తం చేయడానికి అద్భుతమైన బహుమానాలను పంపుతున్నారు.

తాజాగా భారతదేశ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు మెగా ప్రిన్సెస్ కు అద్భుతమైన బహుమతి పంపించారని సమాచారం. మెగా ప్రిన్సెస్ కు వారు అద్భుతమైన, అత్యంత ఖరీదైన బంగారు ఊయలను బహుమతిగా పంపించారు. ఒక కోటి 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఊయలను ముఖేశ్ అంబానీ దంపతులు గిఫ్టుగా పంపించినట్లు సమాచారం.
దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారంతో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారని చెబుతున్నారు. ఈ బంగారు ఊయల లోనే మెగాస్టార్ చిరంజీవి మనవరాలు మెగా ప్రిన్సెస్ బారసాల మహోత్సవాన్ని నిర్వహిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా చరణ్ ఉపాసన దంపతులకు, చిరంజీవి ఇంట మహాలక్ష్మి పుట్టడంతో మెగా ఫ్యామిలీకి ఆనందం అవధులు దాటుతోంది.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ముచ్చట్లన్నీ తీర్చుకోవాలని మెగా ఫ్యామిలీ తెగ తాపత్రయపడుతోంది. చిరంజీవి, సురేఖలలో మనవరాలు పుట్టిన ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేడు నిర్వహించనున్న బారసాల ఫంక్షన్ కు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది సంఖ్యలో సన్నిహితులు హాజరుకానున్నారని తెలుస్తుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications